ఇదంతా మీ వల్లే..“ఇండో అమెరికన్స్”..ని ఆకాశానికి ఎత్తేసిన బిడెన్..!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇరుపార్టీల దృష్టి అంతా భారత సంతతి ఓటర్లపైనే ఉంది.ప్రస్తుతం అమెరికా రాజకీయాలు ఇండో అమెరికన్స్ చుట్టూ తిరుగుతున్నాయనడంలో సందేహం లేదు.

ఇండో అమెరికన్స్ ని ప్రసన్నం చేసుకోవడానికి ఇవ్వని హామీలు.వీసా భద్రతా, ఆ భద్రతా, ఈ భద్రతా అంటూ హామీలు గుప్పిస్తున్నారు.

ఇదిలాఉంటే మూడో వ్యక్తి కాశ్మీర్ విషయంలో కల్పించుకుంటే భారత్ సహించదని తెలిసినా కావాలని వేలు పెట్టిన బిడెన్ ఇప్పుడు భారతీయత, భారతీయుల గొప్పదనం పై ములగ చెట్లు ఎక్కించడం వెనుక ఉన్న ఏకైక లక్ష్యం భారతీయులకి తెలియంది కాదు.ఇక అసలు విషయానికి వెళ్తే.

భారతీయ అమెరికన్స్ ఏర్పాటు చేసిన నేషనల్ వర్చువల్ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో బిడెన్ మాట్లాడుతూ అమెరికా ఆర్ధికంగా ఈ స్థాయికి ఎదిగిందంటే అందుకు ఇండో అమెరికన్స్ పాత్ర అత్యంత కీలకమని అన్నారు.వలస వచ్చిన దేశం కోసం వారు పడిన కష్టం,శ్రమ వృధా కాలేదని అన్నారు.

Advertisement

ఈ క్రమంలోనే బిడెన్ హామీలు కూడా కురిపించారు.నేనే గనుకా అధ్యక్షుడిని అయితే హెచ్-1బీ వీసా చట్టబద్దమైన వలస దారుల వంటి అంశాలపై న్యాయం చేస్తానని అన్నారు.

అమెరికాలో ఆర్ధిక మరియు సాంస్కృతిక చైతన్యం సృష్టించడానికి ఎంతోగానో శ్రమించారు.మీరంటే ప్రత్యేకమైన అభిమానం కలగడానికి ఏకైక కారణం మీ కుటుంభ విలువలని, అందుకే మీ పట్ల నాకు ఎనలేని గౌరవం ఉంటుందని అన్నారు.

అధ్యక్షుడిగా మీకు మంచి పాలన అందిస్తానని దేశ ఆర్దిక వ్యవస్థని గాడిలో పెట్టి, కరోనా మహమ్మారిని కంట్రోల్ చేస్తానని, అత్యంత శక్తివంతమైన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని రూపొందిస్తానని బిడెన్ హామీ ఇచ్చారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు