రోజుకు రు.8కే Jio 2.5GB డేటా అందిస్తోంది... ఇంకా అన్ లిమిటెడ్ కాలింగ్ కూడాను!

రోజురోజుకీ రిలయన్స్ జియో తన కస్టమర్లను పెంచుకుంటూ పోతోంది.

నేడు దేశంలో వున్న అన్ని టెలికాం వ్యవస్థలలో కెల్లా రిలయన్స్ జియో ముందుంది అనడంలో అతిశయోక్తి లేదు.

ఇక దానికి కారణం కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఇక తాజాగా జియో తన వినియోగదారుల కోసం కొత్త అఫర్ ఒకదానిని ప్రకటించింది.

అవును, Jio Happy New Year 2023 అఫర్ పేరుతో ప్రకటించిన ఈ ప్లాన్ చాలామంది ఇన్స్టంట్ యూజర్లకు మేలు చేకూర్చనుంది.జియో ఈ కొత్త రూ.2,023 ప్రీపెయిడ్ ప్లాన్ వలన మిగతా అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ఉచితం అని గుర్తు పెట్టుకోవాలి ఈ ప్లాన్ 252 రోజుల వ్యాలిడిటీని కలిగి వుంది.అలాగే రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 630 GB డేటాని అఫర్ చేస్తుంది.ఈ క్రమంలో డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించబడుతుంది.

డైలీ 100 SMSలు మామ్మూలే.జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

Advertisement

ఈ ప్లాన్ రీఛార్జ్ అమౌంట్ ను వ్యాలిడిటీ కాలంతో రోజుల చొప్పున లెక్కిస్తే మీకు రోజుకు కేవలం 8 రూపాయల ఖర్చే అవుతుంది అని గుర్తు పెట్టుకోవాలి.

హ్యాపీ న్యూ ఇయర్ అఫర్ ప్లాన్ వలన మీరు ఇంతకుమునుపు రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ వలన పొందిన లాభాలను ఇందులో కూడా పొందవచ్చు.లేదంటే మీకు ఏదన్నా సందేహం ఉంటే జియో ఆఫీసియల్ వెబ్ సైట్ ని సందర్శించవచ్చు.

ఇకపోతే నేడు ప్రపంచ వ్యాప్తంగా 5జీకి మంచి డిమాండ్ పెరుగుతోంది.ఈ క్రమంలో డిమాండ్ కు తగినట్లుగా భారతదేశంలో తయారైన 5G పరికరాలకు గ్లోబల్ మార్కెట్‌లో భారీ అవకాశం ఏర్పడింది.

ఈ విషయంలో జియో టెలికాం రంగం చైనాకు సైతం పెద్ద పోటీగా మారనుందని తెలుస్తోంది.

కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?
Advertisement

తాజా వార్తలు