యాంకర్‌ జాన్సీకి కరోనా ఉందా? లేదా?

తెలుగు బుల్లి తెర సెలబ్రెటీలను కరోనా భయం కంగారు పెడుతోంది.ఎంతో మంది బుల్లి తెరకు చెందిన వారు కరోనా భయంతో ఆందోళనకు గురి అవుతున్నారు.

గత కొన్ని రోజుల్లోనే పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.బుల్లి తెరకు చెందిన హీరోలు హీరోయిన్స్‌ కూడా వైరస్‌ బారిన పడ్డట్లుగా అధికారికంగానే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం యాంకర్‌ జాన్సీ కూడా కరోనాతో బాధపడుతుంది అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.పరివార్‌ 2 షూటింగ్‌లో పాల్గొన్న జాన్సికి నవ్య స్వామి నుండి కరోనా వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

మీడియాలో తన గురించి వస్తున్న వార్తలపై స్పందించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తనకు కరోనా అంటూ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టి పారేసింది.

Advertisement

తనకు వైరస్‌ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలా మంది నన్ను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఫోన్‌లో చాలా మంది నన్ను సంప్రదించారు.

నా ఆరోగ్యం గురించి మాట్లాడారు.

నేను ఆరోగ్యంగా ఉన్నాను.ఎలాంటి ఇబ్బంది లేదు.నాకు మీడియాలో వస్తున్న వార్తలతో చిరాకుగా ఉంది.

ఇలాంటి పుకార్లు ఎందుకు పుటిస్తున్నారో అర్థం కావడం లేదు.ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను షూటింగ్స్‌ చేస్తున్నాను.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన .. ఆమెనూ తప్పిస్తున్నారా ? 

ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి.సామాజిక దూరం పాటించని కారణంగానే వైరస్‌ వస్తుంది.

Advertisement

అందుకే ప్రతి ఒక్కరు కూడా కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని జాన్సీ సూచించింది.

తాజా వార్తలు