ఇండియాలో జపాన్ బుల్లెట్ ట్రైన్

ఇండియాలో బుల్లెట్ ట్రైన్ రాబోతున్నది.కొన్ని విదేశాల్లో అతి వేగంగా ప్రయాణించే హై స్పీడ్ బుల్లెట్ రైళ్ళు ఉన్నాయి.

ప్రధానంగా బుల్లెట్ రైళ్లకు చైనా , జపాన్ ప్రసిద్ధి.వాటి సరసన ఇండియా కూడా చేరబోతున్నది.

Japanese Bullet Trains On The Mumbai-Ahmedabad Route-Japanese Bullet Trains On T

ఇండియాలో బుల్లెట్ ట్రైన్ వస్తే చైనాకు ఎందుకు ఆందోళన ? ఎందుకంటే ఇండియా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును జపాన్ సంపాదించుకుంది కాబట్టి.ఇలాంటి ప్రాజెక్టుల ఖర్చు కోట్ల రూపాయల్లో ఉంటుంది.

ఇంతటి మెగా ప్రాజెక్టు తనకు దక్కకుండా పోయినందుకు చైనా బాధపడుతోంది.అయినప్పటకీ రాబోయే ప్రాజెక్టుల్లో తమకూ అవకాశం ఉంటుందని తెలిపింది.

Advertisement

ఇండియాలో వివిధ ప్రాంతాల్లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు నిర్మించే అవకాశం ఉంది.ప్రస్తుతం ఒక్క ప్రాజెక్టు జపానుకు దక్కింది.

కాబట్టి చైనాకు కూడా చాన్సు ఉండవచ్చు.ముంబై -అహమ్మదాబాదు మార్గంలో జపాన్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబోతున్నది.

ఇందుకు ఒప్పందం కుదిరింది.ఈ రెండు నగరాల మధ్య దూరం 500 కిలో మీటర్లు.

ఈ ప్రాజెక్టుకు ఆర్ధిక సహాయం కూడా జపాన్ అందిస్తోంది.చెన్నై -ధిల్లీ మార్గంలో (2,200కిలోమీటర్లు) హై స్పీడ్ రైలు మార్గం ఏర్పాటుకు అధ్యయనం సాగుతోంది.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!

ధిల్లీ -ముంబై మార్గంలో (1200 కిలోమీటర్లు) బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు