తెలుగు టాప్ హీరోలకి 50 కోట్ల షేర్ క్లబ్ ఎలాగో, హింది టాప్ హీరోలకి భారతదేశంలో 200 కోట్ల నెట్ అలాగా.ఈ మార్కుని ఇంతవరకు ఖాన్ త్రయం ఆమీర్, సల్మాన్, షారుఖ్ మాత్రమే అందుకున్నారు.
ఇందులో ఆమీర్ అత్యధికంగా మూడు సార్లు 200 కోట్లు దాటగా, సల్మాన్ రెండు సార్లు, షారుఖ్ ఒకసారి అందుకున్నాడు.ఈ ముగ్గురి చిత్రాలు కాకుండా, కేవలం బాహుబలి ఈ మార్కుని దాటడం విశేషం.300 కోట్ల నెట్ దాటిన చిత్రాలు కేవలం మూడు.అవి పీకే, బాహుబలి, బజరంగి భాయిజాన్.
ఏక్ థా టైగర్ చిత్రంతో 199 కోట్ల నెట్ కొల్లగొట్టి కేవలం కోటి రూపాయలతో ఓసారి 200 కోట్ల సినిమా మిస్ చేసుకున్న సల్మాన్, ఈసారి ప్రేమ్ రతన్ ధన్ పాయో పోరాటాన్ని 193 కోట్ల వద్ద ఆపేసి, 7 కోట్లతో ఆమీర్ ను సమం చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు.
180 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం భారతదేశంలో 105 కోట్ల షేర్, ఒవర్సీస్ లో 40 కోట్ల షేర్ వసూలు చేసింది.సాటిలైట్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ కలుపుకోని కొద్దిపాటి లాభాలతో బయటపడింది.ఇక ప్రేమలీల పేరుతో విడుదలైన తెలుగు వెర్షన్ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.







