జపాన్ లో శృంగార జీవితం కోసం సెలవులు ఇస్తున్న కంపెనీలు... ఎందుకంటే

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన జపాన్ లో ఈ మధ్య కాలంలో జనాభా విపరీతంగా పడిపోతుంది.

దీంతో దేశంలో జనాభా సంఖ్య ఎలా అయినా పెంచాలనే ప్రయత్నంలో ప్రభుత్వం సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది.

జపాన్ లో గత ఏడాది పది లక్షల మంది పిల్లలు జన్మించగా అదే సంవత్సరంలో 13 లక్షల మంది వృద్ధులు చనిపోయారు.దేశంలో లో ఈ స్థాయిలో ఉన్న వృద్ధుల సంఖ్య తగ్గిపోవడంతో పిల్లల సంఖ్యను పెంచాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సంపాదన ధ్యాసలో యువతరం శృంగార జీవితాన్ని ఆస్వాదించడం లేదని ఇటీవల జపాన్లో ఓ అధ్యయనం కూడా స్పష్టం చేసింది.వృద్ధుల సంఖ్య పెరిగి యువతరం సంఖ్య తగ్గి పోతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని భావించిన అక్కడి ప్రభుత్వం యువతరంలో శృంగార కోరికలు పెంచడానికి వయాగ్రాని ఉచితంగా ఇవ్వడం చేస్తుంది.

చాలా ప్రైవేటు కంపెనీలు కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ తమ వంతు ప్రయత్నంగా ఉద్యోగుల్లో పెళ్లి కాని వారు పెళ్లి చేసుకుంటే ప్రత్యేక నజరానాలు అందిస్తుంది.అలాగే వాళ్లు హనీమూన్ కి వెళ్లడానికి ప్యాకేజీ టూర్లను కూడా ఫ్రీగా ఇస్తున్నాయి.

Advertisement

అలాగే పిల్లలు పుట్టిన జంటలకు సైతం ప్రత్యేక నగదు బహుమతులు ఆఫర్ చేస్తున్నాయి.ముగ్గురు పిల్లలు ఉన్న దంపతులకు అదనంగా సాలరీ పెంచడంతో పాటు ఉ వీకెండ్ ఎంజాయ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.

అక్కడ ప్రభుత్వాలు కూడా శృంగార జీవితానికి అలవాటు పడే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ కొత్త పథకాలను అందుబాటులోకి తెస్తున్నాయి.జపాన్ లో 30 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న యువతరంలో సుమారు 12.7 శాతం మంది ఒక్కసారి కూడా శృంగార అనుభవం లేనివారు ఉన్నారని అక్కడి సర్వేలో తెలియజేయడంతో ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యి యువతరాన్ని శృంగార వైపు ఆకర్షించే ఎలా కొత్త విధానాలను తీసుకొస్తుంది.

Advertisement

తాజా వార్తలు