ప్రతి సీఎం విదేశాల వెంట పరుగులే....!

దేశంలోని దాదాపు ప్రతి ముఖ్యమంత్రీ విదేశాల వెంట పరుగెడుతూనే ఉన్నారు.పెట్టుబడుల కోసం అర్రులు చాస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సహా ముఖ్యమంత్రులంతా రండి బాబూ రండి.ఆలసించిన ఆశాభంగం.

మా దగ్గర పెట్టుబడులు పెట్టండి.లాభాలు మూటగట్టుకొని వెళ్లండి అంటూ రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఇరవై దేశాలు తిరిగారు.ప్రతి దేశంలోనూ ప్రవాస భారతీయులతో మీటింగులు పెట్టి ఇండియాలో పరిశ్రమలు నెలకొల్పాలని అభ్యర్థిస్తున్నారు.

Advertisement

భూసేకరణ చట్టానికి సవరణలు ప్రతిపాదించడం కూడా కార్పొరేట్లకు మేలు చేయడానికే.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంగతి తెలిసిందే కదా.రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌కు అప్పగించారు.ముఖ్యమంత్రి కాగానే అనేక దేశాలు తిరిగారు.

ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు స్వర్గమని ఊదరగొడుతున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదే దారిలో ఉన్నారు.

ఆయన కూడా ముఖ్యమంత్రి కాగానే కొన్ని దేశాలు తిరిగొచ్చారు.ప్రస్తుతం చైనాలో ఉన్నారు.

వరల్‌్డ ఎకనమిక్‌ ఫోరంలో పాల్గొనేందుకు వెళ్లినా పెట్టుబడులు సంపాదించుకొని రావడమే ఆయన లక్ష్యం.ఇద్దరు చంద్రులు తమ కుమారులను కూడా అమెరికాకు పంపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్13, శుక్రవారం 2024

ప్రస్తుతం మహారాష్ర్ట ముఖ్యమంత్రి దేవేందర్‌ ఫడ్నవీస్‌ రాజధాని ముంబయిలో జపాన్‌ డెస్కు ఏర్పాటు చేయబోతున్నారు.ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు జపాన్‌ నిధులు సమకూరుస్తోంది.

Advertisement

మహారాష్ర్టలో జపాన్‌ కంపెనీలకు అనుమతులు ఇవ్వడం కోసం సింగిల్‌ విండో ఏర్పాటు చేశారు.మహారాష్ర్టలో పెట్టుబడులు పెట్టుబడులను ఆహ్వానించడానికిగాను టోక్యోలో సెమినార్‌ నిర్వహించారు.

ప్రస్తుతం మన దేశం విదేశీ పెట్టుబడులు లేకుండా మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు.పాలకులు దేశాన్ని విదేశాలకు అమ్మేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

అయినా విదేశాల వెంట పరుగులు ఆపడంలేదు.

తాజా వార్తలు