టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజాగా ‘శ్రీమంతుడు’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెల్సిందే.ఆ సినిమాలో హీరో హర్ష మాదిరిగానే మహేష్‌బాబు కూడా నిజ జీవితంలో రెండు ఊర్లను దత్తత తీసుకున్నాడు.
నిజ జీవితంలో కూడా ‘శ్రీమంతుడు’ అనిపించుకున్నాడు.ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కో గ్రామం చొప్పున రెండు గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్‌బాబు అందరి ప్రశంసలను దక్కించుకుంటున్నాడు.
ఆ గ్రామాల అభివృద్దికి త్వరలోనే పునాది వేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.మహేష్‌బాబు వెళ్లిన దారిలోనే ఆయన సోదరి పద్మావతి కూడా నడవాలని నిర్ణయించుకున్నారు.
మహేష్‌బాబు సోదరి అయిన గల్లా పద్మావతి కూడా ఒక ఊరును దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు.గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ భార్య అయిన పద్మావతి తెనాలి సమీపంలోని కంచర్లపాలెంను దత్తత తీసుకోనుంది.
ఈ విషయాన్ని గల్లా జయదేవ్ స్వయంగా ప్రకటించాడు.శ్రీమంతురాలు గల్లా పద్మావతి అంటూ జయదేవ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
కంచర్లపాలెం గ్రామంను పద్మావతి దగ్గరుండి అభివృద్ది చేస్తాను అంటోందట.త్వరలోనే ఆమె కంచర్లపాలెంకు వెళ్లనుంది.
ఈమె దారిలో మరి కొందరు కూడా శ్రీమంతురాల్లు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.