Janhvi Kapoor Milli Movie : హైదరాబాదులో సందడి చేసిన జాన్వీ కపూర్.. సంతోషంగా ఉందంటూ పోస్ట్?

అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ హైదరాబాదులో సందడి చేశారు.

శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె నటించిన తాజా చిత్రం మిల్లి.

ఈ సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె పలు ప్రాంతాలలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్ వచ్చినటువంటి ఈమె హైదరాబాద్లో కూడా ఈమె ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక పోస్ట్ చేశారు.

అయితే ఈమె తెలుగులో పోస్ట్ చేయడం విశేషం.హైదరాబాద్ రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.

Advertisement
Janhvi Kapoor Made Noise In Hyderabad Post That She Is Happy , Janhvi Kapoor , H

మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ తెలుగులో పోస్ట్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది.

Janhvi Kapoor Made Noise In Hyderabad Post That She Is Happy , Janhvi Kapoor , H

ఇకపోతే ఈమె ధడక్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం పలు సినిమాలలో నటించారు.ఈ సినిమాలన్నీ కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్ గా మంచి హిట్ ఏది ఇవ్వలేకపోయింది ఈ క్రమంలోనే ఈమె ఆశలన్నీ మిల్లి సినిమా పైన పెట్టుకున్నారు.ఈ సినిమా తప్పకుండా తనకు కమర్షియల్ హిట్ ఇస్తుంది అంటూ ఈమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరి మిల్లి సినిమా ద్వారా జాన్వీ కపూర్ కమర్షియల్ హిట్ అందుకుంటారా లేదా అనే విషయం తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాలి.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు