నాట్స్ ఆధ్వర్యంలో మీగడ సరళ పద్య రచనా తరగతులు భాషే రమ్యం.సేవే గమ్యం అనే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా అమెరికాలో తెలుగువారికి మాతృభాషపై మరింత పట్టుపెంచేందుకు రండి రచయితలవుదాం అనే కార్యక్రమాన్ని చేపట్టింది.
కళారత్న డాక్టర్ మీగడ రామలింగస్వామి నేతృత్వంలో పద్యాలు ఎలా రచించాలనే దానిపై శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది.ఈ పద్య రచనా శిక్షణ తరగతులకు తెలుగువారి నుంచి చక్కటి స్పందన లభిస్తోంది.
చాలా మంది ఆన్‌లైన్‌లో ఈ శిక్షణ తరగతులకు హాజరై తాము సొంతంగా సరళ పద్యాలను ఎలా రచించాలనే దానిని నేర్చుకుంటున్నారు.పద్య రచనతో పాటు పద్య గానం ఎలా ఉండాలి.? రాగయుక్తంగా ఎలా ఆలపించాలనేది కూడా మీగడ రామలింగ స్వామి నేర్పిస్తున్నారు.ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టిన నాట్స్ పట్ల అమెరికాలో తెలుగు భాష ప్రేమికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు భాష ప్రేమికులు ఈ ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటున్నారు.తెలుగు భాష కోసం నాట్స్ గతంలో పద్య పోటీలు నిర్వహించిందని.తెలుగు భాష అభివృద్ధికి తమ వంతు కృషి ఎప్పుడూ నాట్స్ చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి అన్నారు.తెలుగు భాష, సాహిత్యం భావితరాలకు అందించేందుకు నాట్స్ మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని నాట్స్ అధ్యక్షుడు బాపు చౌదరి(బాపు) నూతి పేర్కొన్నారు.