బీజేపీ గెలిచినా ఓడినా నష్టం పవన్ కే  ? 

ఎప్పుడూ లేనంత స్థాయిలో ఏపీ పై బీజేపీ దృష్టి పెట్టింది.

కేంద్ర నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అంతా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ పార్టీ పెద్దలు నమ్ముతున్నారు.దీనికి కారణం జనసేన పార్టీతో పొత్తు ఉండడమే.

తమ బలం ఏపీలో అంతంత మాత్రంగానే ఉన్నా , జనసేన కు ఉన్న కేడర్ మొత్తం తమకు అనుకూలంగా మారితే,  విజయం తన ఖాతాలో పడుతుంది అని బిజెపి నమ్ముతోంది.అధికార పార్టీ వైసిపి బలంగా ఉన్నా, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పూర్తిగా బలహీనం కావడంతో, ఆ పార్టీని మరింత బలహీనం చేసి ఆ పార్టీ సానుభూతిపరులు ఓట్లను సైతం బిజెపి వైపు వచ్చేలా చేసుకునేందుకు ఒక వ్యూహం ప్రకారమే ముందుకు వెళుతోంది.

అయితే ఇక్కడ  వైసిపి బలంగా ఉండడంతో, బిజెపి విజయం సాధిస్తుంది అనేది అందరికీ అనుమానం గా ఉంది.ఒకవేళ ఇక్కడ బీజేపీ గెలిచినా, ఓడినా దాని ప్రభావం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన బాగా పడుతుంది.

Advertisement

తిరుపతి ఎన్నికల హడావుడి లేక ముందు పవన్ ను పెద్దగా పట్టించుకోనట్టు గా వ్యవహరించిన బిజెపి, ఇప్పుడు మాత్రం ఆయనకు ఎక్కడలేని ప్రాధాన్యం ఇచ్చేస్తోంది.ఆయన తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తోంది.

జాతీయ పార్టీగా అధికారంలో ఉన్న బిజెపి ఏపీ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడం,  ఏపీకి ప్రత్యేక హోదా తో పాటు అనేక అంశాలలో దాటవేసే ధోరణితో వ్యవహరించడం, జనాలలోను బిజెపి పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉండడం, ఇవన్నీ ఈ తిరుపతి ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలే.

ఇక్కడ బిజెపి గెలిచినా, ఓడినా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.ఇక్కడ బిజెపి ఓడితే పవన్ కారణంగానే తాము ఓడిపోయామని, జనసేన కార్యకర్తలు బిజెపి విజయం కోసం కృషి చేయలేదని ఆ పార్టీ నిందలు వేసే ప్రమాదం ఉంది.అలాగే బిజెపి గెలిస్తే ఏపీకి ప్రయోజనాలు కల్పించే బాధ్యత పవన్ పైన పడుతుంది.

ప్రత్యేక హోదా తో పాటు, అనేక అంశాల్లో పవన్ పై ఒత్తిడి పెరుగుతుంది.ఎలా చూసుకున్నా ఇక్కడ బిజెపి ఈ విషయంలో పవన్ నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

ప్రస్తుతం చూస్తే జనసేన కేడర్ బిజెపి విజయం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తాయా అంటే అది అనుమానంగానే ఉంది.మొన్నటి వరకు తమ విషయంలో బీజేపీ అవమానకరంగా వ్యవహరించిందిిిిి   అని,ఇప్పుడు తిరుపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ సీఎం అంటూ తమకు ప్రాధాన్యం కల్పిస్తూ వస్తుండడం ఇలా ఎన్నో విషయాలపై జనసైనికులు బీజేపీపై గురువుగానే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు