తెలంగాణలో యాక్టివ్ కానున్న జనసేన... రంజుగా మారిన రాజకీయం

తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకు అనేక మలుపులు తిరుగుతోంది.

ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో కొత్తగా షర్మిల పార్టీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో రాజకీయంగా తెలంగాణలో చాలా అవకాశాలు ఉన్నాయని పార్టీలు భావిస్తున్నాయి.

అందుకే జనసేన కూడా ఇక తెలంగాణపై దృష్టి పెట్టాలని భావిస్తోంది.ఇప్పటికే తెలంగాణలో ఉన్న జనసేన విభాగం కూడా యాక్టివ్ గా లేకపోయినా అడపాదడపా రకరకాల సమస్యలపై తమ గళం వినిపిస్తూనే ఉన్నారు.

అయితే కొత్త పార్టీలు తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న సమయంలో పార్టీ ఎప్పటి నుంచి ఉన్నా సరైన సమయంలో పరిస్థితులను వినియోగించుకోకపోతే పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం కష్టం అనేది జనసేన నేతల్లో ఉన్న అభిప్రాయం.అయితే పవన్ కల్యాణ్ స్టాండ్ ఇప్పటికీ క్లియర్ గా లేకపోవడంతో ప్రభుత్వానికి మద్దతిస్తుందా లేక ప్రతిపక్ష స్థానంలో ఉండి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందా అనేది ఒక క్లారిటీ లేకపోవడంతో ప్రజలు జనసేన వైపు ఆలోచించడానికి చొరవ చూపడం లేదన్నది మాత్రం వాస్తవం.

అయితే కొత్త పార్టీలు వచ్చి తెలంగాణలో స్థిరపడితే మరల పోరాట శైలిని మార్చుకోవాల్సిన అవసరం జనసేనకు ఉంటుంది.అందుకే నాగార్జున సాగర్ లో మద్దతు విషయంలో సస్పెన్స్ లో ఉండేలా చూసుకుంటూ ఒక చర్చకు దారితీసేలా ఉండాలన్నది బీజేపీ వ్యూహంలా కనిపిస్తోంది.

Advertisement
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు