Janasena Seats : సీట్లు త్యాగం చేసిన జనసేన ! మూడు పార్టీల సీట్ల పంపకాలు ఇలా..

ఏపీలో టిడిపి, జనసేన, బిజెపిలు పొత్తు( TDP Janasena BJP Alliance ) పెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ మూడు పార్టీలు కలిసి వైసీపీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.

పొత్తులో భాగంగా జనసేన, టిడిపి, బిజెపిల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం పైన ఒక క్లారిటీ వచ్చింది.పొత్తులో భాగంగా జనసేన , బీజేపీ 31 అసెంబ్లీ స్థానాలకు, 8 ఎంపీ స్థానాలకు పోటీ చేయబోతున్నాయి.

వీటిలో జనసేన( Janasena ) 21 అసెంబ్లీ,  2 లోక్ సభ స్థానాలను తీసుకుంది.బిజెపి 10 అసెంబ్లీ , ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది.144 అసెంబ్లీ ,17 లోక్ సభ స్థానాల్లో టిడిపి పోటీ చేయాలని నిర్ణయించుకుంది.ఉండవల్లి లో చంద్రబాబు( Chandrababu Naidu ) నివాసంలో సుమారు 8 గంటల పాటు ఈ సీట్ల పంపకాలపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షకావత్ ,( Gajendra Singh Shekawat ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , ( Pawan Kalyan ) బిజెపి జాతీయ నేత వైజయంత్ , చంద్రబాబు సీట్ల సర్దుబాటుపై చర్చించి ఏకాభిప్రాయంకి వచ్చారు.

ఇదిలా ఉంటే టిడిపి తో ఇప్పటికే జనసేన సీట్ల సర్దుబాటు చేసింది.మూడు లోక్ సభ , 24 అసెంబ్లీ స్థానాలను పొత్తులో భాగంగా తీసుకుంది.తర్వాత బిజెపితో పొత్తు కుదరడం తో జనసేన మూడు అసెంబ్లీ,  ఒక లోక్ సభ స్థానాన్ని బిజెపి కోసం త్యాగం చేసింది.

Advertisement

బీజేపీ తోనూ పొత్తులు , సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి రావడంతో,  కేంద్ర బీజేపీ పెద్దలు రెండు మూడు రోజుల్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి( Daggubati Purandeshwari ) తెలిపారు.ఇది ఇలా ఉంటే విజయవాడ ఎంపీ సీటు బిజెపి కోరడంతో,  దానిని ఇచ్చేందుకు టిడిపి నిరాకరించింది.అరకు ,విశాఖ, రాజమండ్రి,  నరసాపురం లేదా ఏలూరు,  రాజంపేట,  హిందూపురం సీట్లు బిజెపి కోరిందట.

బిజెపి ఆశిస్తున్న విశాఖ లేదా రాజమండ్రిలో ఏదో ఒక స్థానాన్ని మాత్రమే ఇచ్చేందుకు టిడిపి నిర్ణయించుకుంది.

జనసేన మాత్రం బాలసౌరికి మచిలీపట్నం , పవన్ కోసం కాకినాడ దాదాపుగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.  అరకు నుంచి కొత్తపల్లి గీత,  రాజమండ్రి నుంచి పురందరేశ్వరి , నర్సాపురం నుంచి రఘురామకృష్ణంరాజు తో పాటు నరేంద్ర వర్మ పేర్లను పరిశీలిస్తుంది బిజెపి.అలాగే తిరుపతి రత్నప్రభ లేదా నిహారిక , హిందూపురం సత్య కుమార్ , రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి ని పోటీకి దింపే ఆలోచనలో ఉంది.

అనకాపల్లి ఏలూరు పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు