బీజేపీ అధిష్టానం పై పవన్ కళ్యాణ్ ఫైర్..వైసీపీ తొత్తులు అంటూ కామెంట్స్?

ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు ని ఈసారి చీలనివ్వబోను అంటూ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేసిన వ్యాఖ్యలు అధికా వైసీపీ పార్టీ లో ఎలాంటి గుబులు పుట్టించిందో మనమంతా చూసాము .

పొత్తు ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ఎప్పుడో ప్రకటించినప్పటికీ, రాష్ట్ర పరిస్థితుల ఆధారంగా ప్రకటిద్దాం అని కొన్ని రోజులు ఎదురు చూసారు.

అయితే తెలుగు దేశం పార్టీ అధినేత , మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్ట్ అవ్వడం, పవన్ కళ్యాణ్ ఆయన్ని స్వయంగా రాజమండ్రి జైలు లో కలిసి పరామర్శించడం, ఆ తర్వాత వెంటనే బయటకి వచ్చి పొత్తు ప్రకటించడం, ఇలా చక చకా జరిగిపోయిన ఈ సంఘటనలు కారణంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.రీసెంట్ గానే రాజమండ్రి లో టీడీపీ - జనసేన పార్టీల తొలి సమన్వయ కమిటీ ని ఏర్పాటు చేసారు.

ఈ కమిటీ లో పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశం లో రాబొయ్యే రోజుల్లో ఇరు పార్టీల నాయకులూ మరియు కార్యకర్తలు కలిసి క్షేత్ర స్థాయిలో ఎలా ముందుకు పోవాలి అనే దానిపై చర్చలు జరిపారు ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ తో పొత్తు( TDP ) పెట్టుకున్నప్పట్టికీ, ఎన్డీయే నుండి పూర్తిగా బయటకి రాలేదు.రీసెంట్ గానే అమిత్ షా ( Amit Shah ) తెలంగాణ ఎన్నికలలో కలిసి పోటీ చెయ్యడం పై చర్చలు జరిపాడు.కానీ కలిసి పోటీ చేస్తున్నారా లేదా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.32 స్థానాల్లో పోటీ అయితే చేయబోతున్నాం అని జనసేన పార్టీ తెలిపింది.అభ్యర్థులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Advertisement

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన మరియు టీడీపీ తో కలిసి బీజేపీ పార్టీ( BJP ) వస్తుందా అనే విషయం పై కూడా ఇంకా క్లారిటీ రాలేదు.

ఇకపోతే రీసెంట్ గా బీజేపీ పార్టీ కి సంబంధించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య నాయకులూ పవన్ కళ్యాణ్ తో చాలాసేపటి వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపారట.ఈ చర్చల్లో పవన్ కళ్యాణ్ ని తెలుగు దేశం పార్టీ తో పొత్తు ని రద్దు చేసుకోమని, మన ఇరు పార్టీలు మాత్రమే కలిసి పోటీ చేద్దాం అని, భవిష్యత్తులో మన పార్టీలు ప్రత్యామ్న్యాయ శక్తిగా ఎదగాలంటే టీడీపీ తో కలిసి పోటీ చెయ్యడం ఆపుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ కి సలహాలు ఇచ్చారట.దీనికి పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులకు చాలా గట్టి సమాధానమే ఇచ్చాడట.

మేము నిర్ణయం తీసేసుకున్నాం, మీరు మాతో వస్తారా?, లేదా వైసీపీ తో కలిసి పోతారా అనేది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాం అంటూ కౌంటర్ ఇచ్చాడట పవన్ కళ్యాణ్.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

తాజా వార్తలు