ఏపీలో అధికారం చేపట్టాలనే పట్టుదలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు.ప్రజాపోరాట యాత్ర పేరుతో ప్రజల్లో తిరుగుతూ … పార్టీ పరపతి పెంచుతున్నాడు.
జనాల్లో కూడా జనసేన పార్టీపై ఒక సదభిప్రాయం కలిగించగలిగింది.అంతే కాదు ఏపీలోని ప్రధాన పార్టీల వెన్నులో వణుకు పుట్టించే రేంజ్ లో పవన్ తన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు.
ఇంతవరకు బాగానే ఉన్నా … ఇప్పుడు జనసేన పార్టీ లో కీలక నాయకులు అందునా … పవన్ కోటరీ నాయకులను ఆయన పక్కనపెట్టాడనే వార్తలు ఇప్పుడు జనసేన కిందిస్థాయి నాయకుల్లో పెద్ద జార్చకు దారి తీస్తోంది.

గత కొంతకాలంగా… జనసేన పార్టీలో ఇంటిపోరు ముదిరింది.ఆ పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు కీలక నాయకులు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.అయితే వారిద్దరినీ పవనే దూరంగా పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.
జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి
ఆయన వెనుకున్న వ్యక్తి ఒకరు కాగా… ఇటీవలే పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా ఒక ఛానెల్ నే లీజుకు తీసుకున్న వ్యక్తి మరొకరు.పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్రలో కానీ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా వీరిద్దరూ పక్కనుండాల్సిందే.
కానీ ఇప్పుడు వారిద్దరిని పక్కన కాదు కదా కనీసం వెనుకంచుకోవడానికి కూడా పవన్ ఇష్టపడడంలేదట.
ఆ ఇద్దరు నాయకులు మరెవరో కాదు ఒకరు మాదాసు గంగాధరం కాగా.
మరొకరు తోట చంద్రశేఖర్.వీరిద్దరిని పవన్ కళ్యాణ్ కావాలనే దూరం పెట్టారని ప్రచారం సాగుతోంది.
వారిపై పవన్ విశ్వాసం కోల్పోవడం వల్లే వారిని పార్టీకి దూరంగా ఉంచారని విశ్వసనీయ సమాచారం.మాదాసు తనతో చర్చించకుండా సీట్ల కేటాయింపుల్లో వేలుపెడుతున్నారని కొందరికి సీట్లిస్తామంటూ హామీలు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో గుర్రుగా ఉన్నారట.

ఇక తోట విషయానికి వస్తే… ఇటీవల ఓ హోటల్‌లో వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భేటీ అయ్యారట.సీట్ల సర్దుబాటు విషయంలో తనదే ఫైనల్ అని విజయసాయికి చెప్పారంట.అదే విషయంపై పవన్ తో విజయసాయి చర్చించారంట.తాను అలాంటి ప్రతిపాదనే తీసుకురాలేదని విజయసాయిరెడ్డికి పవన్ వివరణ ఇచ్చారట.ఈ విషయంలో పవన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యి తోట మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడట.ఈ నేపథ్యంలోనే వీరిద్దరి హవా జనసేనలో తగ్గడానికి కారణమట.