ఇక తగ్గేదే లేదు ! కీలక నిర్ణయాల దిశగా పవన్ ?

మొదటి, రెండు, మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అందరూ ఊహించినట్టుగానే అధికార పార్టీ వైసీపీ మెజారిటీ స్థానాలను దక్కించుకుని, తమ బలం నిరూపించుకుంది.

అయితే ఎవరూ ఊహించని విధంగా జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా బలం పుంజుకోవడం, గ్రామస్థాయిలో జనసేనకు గట్టిపట్టు ఉంది అనే విషయం బహిర్గతం అవ్వడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, ఆ పార్టీ నాయకులు ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలను సాధించింది.

ఇదంతా పవన్ క్రెడిట్ అనే కంటే, జనసైనికుల కృషి, పట్టుదలే కారణంగా చెప్పవచ్చు.ఏదో రకంగా జనసేన ను జనాల్లోకి తీసుకువెళ్లి బలమైన పార్టీగా ముద్ర వేయాలని మొదటి నుంచి జనసైనికులు పనిచేస్తున్నారు.

పార్టీ నుంచి ఆదేశాలు రాకపోయినా, జనసేన కోసం అహర్నిశలు పనిచేస్తూ, ఎన్నికలలో జనసేన కు ఊపు తీసుకురావడంలో వారే కీలకంగా వ్యవహరిస్తూ అనుకున్న ఫలితాలను సాధించగలుగుతున్నారు.ఎప్పటికైనా అధికారంలోకి రావాలని, అధికారపర్టీ వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం తామే అన్నంత స్థాయిలో ఇప్పుడు జనసేనలో ఊపు కనిపిస్తోంది.

ఇక ఈ ఫలితాలు తరువాత పవన్ కళ్యాణ్ లో సైతం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.ఇప్పటి వరకు ఎన్నో అవమానాలకు గురవుతూనే బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు.

Advertisement

బిజెపి డిమాండ్ లు అన్నింటికీ పవన్ అంగీకారం తెలుపుతూ వచ్చారు.కానీ ఏపీలో బీజేపీ కంటే జనసేన బలమైన పార్టీ అనే విషయం స్పష్టం అవ్వడం, ఇక బిజెపి తమతో కలిసి వచ్చినా రాకపోయినా సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని, ఇకపై బిజెపి అదుపు ఆజ్ఞల తో సంబంధం లేకుండా, స్వతంత్రంగా వ్యవహరించాలని, ఆ పార్టీతో పొత్తు ఉన్నా లేకపోయినా ధైర్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట.

అలాగే జనసేన పార్టీకి సంబంధించి గ్రామస్థాయి నుంచి కమిటీలను నియమించి బలమైన పార్టీగా ముద్ర వేయించుకునేందుకు ఇప్పటికే వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ పంచాయతీ ఎన్నికలలో జనసేన బలం ఏంటో తెలిసింది కాబట్టి, ఇక కమిటీలను నియమించి, ప్రజా ఉద్యమాలు నిరంతరం చేపడుతూ, ప్రజల్లోకి వెళ్లి రాబోయే ఎన్నికల నాటికి బలమైన పార్టీగా జనసేన ను తీర్చిదిద్దాలని పవన్ ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం.ఇక ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకూడదని, ఇప్పుడు రాబోయే, ఎంపిటిసి, జెడ్ పి టి సి, మున్సిపల్ ఎన్నికలలోనూ ఇంతే స్థాయిలో సత్తా చాటుకుని, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి బలమైన పార్టీగా జనసేన అవతరించాలని, అదే ఊపుతో ఎన్నికలకు వెళ్లి అధికారం సంపాదించాలనే ఆలోచనతో పవన్ ఉన్నారట.

అలాగే జనసేనలో యువ నాయకుల ప్రాధాన్యం పెంచాలని, ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన, ప్రజాదరణ కలిగిన నాయకులను చేర్చుకోవాలని, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు సైతం పార్టీలో సమ ప్రాధాన్యం ఉండేలా చేసుకోవాలనే ఆలోచనతో పవన్ ప్లాన్ చేస్తూ, ఆ విధంగా ముందుకు వెళ్తున్నారట.

లడ్డూ వివాదం : ఆ ముగ్గురికి షర్మిల విజ్ఞప్తి 
Advertisement

తాజా వార్తలు