బీజేపీ కుట్రలో భాగమే మునుగోడు ఉపఎన్నికన్న మంత్రి జగదీశ్ రెడ్డి

బీజేపీ కుట్రలో భాగమే మునుగోడు ఉప ఎన్నికని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.ఒక వ్యక్తి స్వార్థం వలనే ఉపఎన్నిక వచ్చిందని అన్నారు.

ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలు పన్నుతోందని విమర్శించారు.దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ విస్మరించిందని తెలిపారు.

ప్రజలకు మేం ఇది చేసామని చెప్పడానికి బీజేపీ చేసేందేమీ లేదని ఎద్దేవా చేశారు.ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని కొనియాడారు.

బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి కేవలం కేసీఆరేనని మంత్రి పేర్కొన్నారు.అందుకే కేసీఆర్ ను చూసి బీజేపీ భయపడుతోందని వెల్లడించారు.

Advertisement
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు