జగన్ అలా ఎందుకన్నాడు..? ఇప్పుడు ఇలా అయ్యింది ఏంటి..?

అత్యంత సున్నితమైన కులాల ప్రస్తావన తీసుకొచ్చాడు.రాజకీయంగా ఇప్పుడు ఆ కులం ఓట్లు వైసీపీ కోల్పోతోంది.

అనవసరంగా కెలికాడు.అలా అనకుండా ఉండాల్సింది అంటూ జగన్ గురించి అనేక కామెంట్లు వస్తున్నాయి.

అయితే జగన్ కాపు ప్రకటన వెనుక పెద్ద రాజకీయమే ఉందని, ఆ తరువాత జగన్ ప్లేట్ ఫిరాయించడానికి కూడా బలమైన కారణం ఉందని ఇప్పుడు వార్తలు బయటకి వస్తున్నాయి.జగన్ ప్రకటన వెనుక ఆయన రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ హస్తం కూడా ఉన్నట్టు , ఆయన మొదటి నుంచి కులాల లెక్కలు వేయడం లో నిమగ్నమై ఉన్నాడని ఆయన సూచన మేరకే జగన్ కాపులకు కోపం తెప్పించినా ఫర్వాలేదు అనే ధోరణిలో మాట్లాడారని ఆదం అవుతోంది.

ఎప్పటికప్పుడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి పీకే టీమ్ సర్వేలను నిర్వహిస్తోంది.జనసేన పేరుతో పవన్ పార్టీ పెట్టిన తర్వాత మొత్తం సమీకరణాలు మారిపోయాయి.

Advertisement

దీంతో జగన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.జనసేనతో పలుకుబడి వల్ల తమకు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని భావించిన ఆయన, పవన్ కు ప్రజల్లో పలుకుబడిని తగ్గించి వ్యతిరేకత పెంచాలనే ధోరణిలో ముందుకు వెళ్తున్నాడు.

సాధారణంగానే పవన్ ను కాపు కులం వారు తమ ఆరాధ్య దైవంగా చూస్తున్నారు.ఇక ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తరువాత ఆ సామాజికవర్గం యువకులంతా పవన్ నామం జపిస్తున్నారు.దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది.

టీడీపీని దెబ్బ కొట్టాలంటే బీసీలను ఆకర్షించాలి.బీసీలు సంప్రదాయ బద్ధంగా టీడీపీకి మద్దతుదారులు.

వారు కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు.తాను కూడా కాపు రిజర్వేషన్లకు అనుకూలం కాదంటే కాపు సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత, బీసీల నుంచి మద్దతు పెరిగి రెండు వర్గాల మధ్య పోటా పోటీ వాతావరణం ఏర్పడుతుందని జగన్ భావించినట్టు సమాచారం.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
రాజకీయాల కంటే సినిమాలే బెటర్.. కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

కానీ కాపు రిజర్వేషన్ నేను అమలు చేయలేను అని జగన్ బహిరంగంగా ప్రకటించినా బీసీల నుంచి సరైన స్పందన కనిపించలేదని, జగన్ ను అభినందిస్తూ బీసీ నాయకులు ఎవరూ ప్రకటనలు చేయకపోవడంతో జగన్ డైలమాలో పడ్డాడు.అనవసరం గా అటు ఇటు కాకుండా పోతున్నానా అనే ఆలోచనతో నాలుక్కరుచుకున్న జగన్ యు టర్న్ తీసుకుని నా మాటలు వక్రీకరించారని చెప్పుకుంటూ నష్ట నివారణ చర్యలకు దిగాడు.

Advertisement

తాజా వార్తలు