అవినీతి కేసులు ఉన్న వారి పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ?

దేశంలో అవినీతికి పాల్పడని వారంటూ ఉండరు.ఏదో ఒక సందర్భంలో, ఎప్పుడో ఒకప్పుడు నీతి మాలిన పనులు చేస్తూనే ఉంటారు.

ఇంకా కొందరు ప్రభుత్వ ఉద్యోగులకైతే అవినీతి చేయందే ముద్ద దిగదు.దీనికి కారణం ఇలాంటి పనులు చేసే వారి విషయంలో సరైన పనిష్మెంట్ లేకపోవడమే.

ప్రస్తుతం సమాజంలో అవినీతి అనేది ఒక బలహీనతగా మారిపోయింది.ప్రజలు కూడా ఇలాంటి వారికి అలవాటుపడిపోయారు.

ఇకపోతే ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడే ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.అవినీతి కేసుల్లో ఉద్యోగులపై 100 రోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా జగన్ సర్కార్ అడుగులు వేస్తుంది.

Advertisement

పక్కా ఆధారాలతో దొరికిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఏసీబీ డీజీ, శాఖల ఉన్నతాధికారుల కమిటీ సిఫార్సుల మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది.కాగా నిర్ణీత 100 రోజుల్లో చర్యలు తీసుకోకుంటే ఆలస్యానికి కారణం అయిన వారిపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం పేర్కొంది.

విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ...క్లారిటీ ఇచ్చిన టీమ్!

Advertisement

తాజా వార్తలు