విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ...క్లారిటీ ఇచ్చిన టీమ్!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ).ఇటీవల ఫ్యామిలీ స్టార్( Family Star ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

 Prashanth Neel Team Gives Clarity To Movie With Vijay Devarakonda, Vijay Devarak-TeluguStop.com

సినిమా ఎన్నో అంచనాల నడుము ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచిందని చెప్పాలి.

ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా గౌతమ్ తిన్ననూరి( Gautham Tinnanuri ) దర్శకత్వంలో చేస్తున్నారు.

Telugu Salaar, Prashanth Neel-Movie

ప్రస్తుతం ఈ సినిమా పనులలో దేవరకొండ బిజీగా ఉన్నారు.

ఈ సినిమా తర్వాత సినిమా చేయబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి.అయితే తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నటించబోతున్నారు అంటూ మరో వార్త వైరల్ అవుతుంది.

ఇలా ఈ వార్తలు బయటకు రావడానికి కారణం లేకపోలేదు ఇటీవల హైదరాబాద్ లో విజయ్ ఇంటికి డైరెక్టర్ ప్రశాంత్ వెళ్లడంతో ఈ వార్తలు కాస్త సంచలనగా మారాయి.

Telugu Salaar, Prashanth Neel-Movie

ఇక విజయ్ దేవరకొండ ప్రశాంత్ కాంబినేషన్లో సినిమా రాబోతుందని వార్తలు పెద్ద ఎత్తున వైరల్ గా మారడంతో ప్రశాంత్ నీల్  టీం ఈ వార్తలపై స్పందించారు.విజయ్ దేవరకొండ ప్రశాంత్ కాంబోలో సినిమా రాబోతోంది అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇదంతా కూడా నిరాధార కథనాలు అని కొట్టి పారేశారు.ప్రస్తుతం ప్రశాంత్ తన సినిమా పనులలో బిజీగా ఉన్నారని తెలిపారు.

ఈయన ప్రస్తుతం సలార్ 2( Salaar 2 ) ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత ఈయన ఎన్టీఆర్ తో కూడా సినిమాని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర( Devara ), వార్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.ఈ పనుల తర్వాత ప్రశాంత్ సినిమాతో బిజీ కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube