విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ…క్లారిటీ ఇచ్చిన టీమ్!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ).ఇటీవల ఫ్యామిలీ స్టార్( Family Star ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

సినిమా ఎన్నో అంచనాల నడుము ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచిందని చెప్పాలి.

ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా గౌతమ్ తిన్ననూరి( Gautham Tinnanuri ) దర్శకత్వంలో చేస్తున్నారు.

""img Src=" "/ ప్రస్తుతం ఈ సినిమా పనులలో దేవరకొండ బిజీగా ఉన్నారు.

ఈ సినిమా తర్వాత సినిమా చేయబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి.అయితే తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నటించబోతున్నారు అంటూ మరో వార్త వైరల్ అవుతుంది.

ఇలా ఈ వార్తలు బయటకు రావడానికి కారణం లేకపోలేదు ఇటీవల హైదరాబాద్ లో విజయ్ ఇంటికి డైరెక్టర్ ప్రశాంత్ వెళ్లడంతో ఈ వార్తలు కాస్త సంచలనగా మారాయి.

"""/"/ ఇక విజయ్ దేవరకొండ ప్రశాంత్ కాంబినేషన్లో సినిమా రాబోతుందని వార్తలు పెద్ద ఎత్తున వైరల్ గా మారడంతో ప్రశాంత్ నీల్  టీం ఈ వార్తలపై స్పందించారు.

విజయ్ దేవరకొండ ప్రశాంత్ కాంబోలో సినిమా రాబోతోంది అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇదంతా కూడా నిరాధార కథనాలు అని కొట్టి పారేశారు.

ప్రస్తుతం ప్రశాంత్ తన సినిమా పనులలో బిజీగా ఉన్నారని తెలిపారు.ఈయన ప్రస్తుతం సలార్ 2( Salaar 2 ) ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా తర్వాత ఈయన ఎన్టీఆర్ తో కూడా సినిమాని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర( Devara ), వార్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

ఈ పనుల తర్వాత ప్రశాంత్ సినిమాతో బిజీ కానున్నారు.

క్లీంకార మా జీవితాల్లో ఆనందాన్ని నింపింది.. ఉపాసన ఆసక్తికర పోస్ట్ వైరల్!