జగన్ ను ముంచేస్తున్న అసంతృప్తి ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, ఆ పార్టీలోని నాయకులు యాక్టివ్ గా కనిపించేవారు.

పార్టీ అధిష్టానం ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తూ, అధికార పార్టీ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, పోరాటాలు చేసే వారు.

పార్టీని నాయకులు ఎవరికి వారు తమ భుజస్కంధాలపై మోస్తూ, అధికార పార్టీల వేధింపులను తట్టుకుంటూ, వారి ఆగడాలను ఎదుర్కుంటూ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు.జగన్ సొంతంగా పార్టీ స్థాపించి అధికారంలోకి రాగలిగారు అంటే అది నిజంగా గొప్ప విషయమే.

ఆ స్థాయిలో కార్యకర్తలు ఎవరికి వారు తమ సొంత పార్టీగా వైసీపీని భావించడమే.పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు మేలు జరుగుతుందని, పార్టీ తమకు పెద్దపీట వేస్తోంది అని భావించిన వారందరికీ నిరాశే ఎదురయ్యింది.

అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు సిసలు కష్టాలు నాయకులకు మొదలయ్యాయి.పార్టీలో అసంతృప్తులు, గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో పార్టీ కోసం పని చేసిన అసలు సిసలైన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement
Ap Cm Ys Jagan Not Happy With Party Leaders Behavior , Jagan, Ysrcp, Ap,, Tdp,

ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ ఆఫీసులో కంటే, సొంతంగా ఆఫీసు ఏర్పాటు చేసుకుని మొదటి నుంచి వైసీపీతో కొనసాగుతున్న వారికంటే, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికీ, నచ్చిన వారికి పదవులు ఇవ్వడం వంటివి అసంతృప్తిని కలిగిస్తున్నాయి.వైసీపీ పంచాయతీ ఎన్నికలలో గెలుస్తాము అనుకున్న స్థానాల్లోనూ ఓటమి చెందడానికి ప్రధాన కారణం పార్టీలో నెలకొన్న అసంతృప్తే కారణం అనే విషయం జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత జగన్ ఇప్పుడు దృష్టిపెట్టారు.

Ap Cm Ys Jagan Not Happy With Party Leaders Behavior , Jagan, Ysrcp, Ap,, Tdp,

పార్టీలో నెలకొన్న అసంతృప్తి తన రాజకీయానికి అడ్డుకట్ట వేస్తుంది అనే భయం జగన్ లోనూ మొదలవడంతో, ఎన్నికల తంతు మొత్తం ముగిసిన తర్వాత పూర్తిగా పార్టీని ప్రక్షాళన చేయాలని బలంగా ఫిక్స్ అయ్యారట.ఇప్పటి నుంచే పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టకపోతే, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత బలహీనంగా మారుతుందని జగన్ జాగ్రత్తపడుతున్నారట.

Advertisement

తాజా వార్తలు