ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో కొత్త విధానం తీసుకొచ్చింది.విషయంలోకి వెళ్తే రైల్వే టికెట్ ల మాదిరిగా సినిమా టికెట్ లకు కూడా ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావటం జరిగింది.
జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం తో… ప్రేక్షకులు సినిమా థియేటర్ వద్ద పడిగాపులు కాసే పరిస్థితి ఉండదు.పైగా అధిక ధరలకు ప్రేక్షకులు తమ జోబులో నుండి డబ్బులు తీయాల్సిన అవసరం ఉండదు.
ఎందుకంటే సినిమా టికెట్ ధర మొత్తం ప్రభుత్వం అదినం లోనే ఉంటది.టికెట్ ధరల (ticket rate) విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు త్వరలోనే పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది ఏపీ ప్రభుత్వం.
ఈ మేరకు జీవోను కూడా విడుదల చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే కొత్తగా అమల్లోకి తీసుకువచ్చిన విధివిధానాలు ప్రక్రియ ఫిలిం టీవీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేతికి అప్పచెప్పడం జరిగింది.
ఈ పరిణామంతో రాష్ట్రంలో సినిమా హాల్లో ఆన్లైన్ బుకింగ్ మొత్తం ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నట్లు అయింది.సినిమాకి వచ్చే కలెక్షన్ మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుంది.
ప్రతి నెల 30వ తారీఖున నిర్మాతలకు అదే రీతిలో సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఎవరి వాటా వారికి ప్రభుత్వమే అందిస్తుంది అప్పటిదాకా డబ్బులన్నీ.ప్రభుత్వం అధీనంలోనే ఉంటాయి.
జగన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో.పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు విడుదలైన టైం లో.భారీగా టికెట్ రేటు పెంచేసి ప్రేక్షకుల దగ్గర దోచుకునే పరిస్థితి కి అడ్డుకట్ట పడినట్లయింది.టికెట్ ధర మొత్తం ప్రభుత్వం చేతిలో ఉండటంతో.
సినిమా ప్రేక్షకుల జోబికి చిల్లు పడకుండా.ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ దొరకనుంది.
ఇక ఇదే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.