ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల తరలింపుకు సిద్ధం కావటంతో ఖాళీ అవుతున్న ఏపీ కార్యాలయాలను తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలుస్తోంది.
మరో ఎనిమదేళ్లపాటు ఏపీ ప్రభుత్వం ఇక్కడ నుంచి పాలన కొనసాగించే అవకాశాలున్నప్పటికీ, వాడుకోవచ్చు, ఇందుకోసం ఇబ్బందులు సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందన్న వాదనలు వినిపించడంతో, ఆ మధ్య .హైదరాబాద్ శాంతిభద్రతల విషయంలో గవర్నరు కు అధికారం కల్పించే సెక్షన్ ఎనిమిదిని తెరమీదకు తీసుకువచ్చారు కూడా.అయితే వాస్తవ పరిస్ధితి పరగణలోనికి తీసుకుని అమరావతికి తరలిపోయే ప్రక్రియ ప్రారంభించింది ఏపి ప్రభుత్వం.
కాగా తెలంగాణ రాష్ట్రానికి కొత్త సెక్రటేరియట్ కట్టించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎర్రగడ్డలోని ఛాతి ఆసుపత్రితో సహా పలు స్థలాలను పరిశీలించడం, ప్రతిపాదించడం రకరకాల కారణాలతో విరమించుకోవడం కొనసాగుతున్న నేపథ్యంలో మరోమారు కొత్త సెక్రటేరియట్ అంశం కేసీఆర్ దృష్టికి వచ్చింది.
స్థల అన్వేషణ ఆపేసి ఉన్న సచివాలయాన్నే కూల్చేసి, కొత్తగా కట్టించుకుంటే బెటరన్న అభిప్రాయం వినిపించడంతో ఆదిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం .మొత్తం సచివాలయాన్ని కూలగొట్టి బహుళ అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మించేందుకు అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఓ కంపెనీకి అప్పగించే ఆలోచన చేస్తున్నదనే ఊహాగానాలు సాగుతున్నాయి.
హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న సెక్రటేరియట్ స్థలంలో ప్రతిష్టాత్మకంగా స్కైస్క్రపర్ల నిర్మాణం కోసం ఏపీ సెక్రటేరియట్ భవనాలను సైతం కూల్చివేయాల్సి ఉందనీ, వాటిని తమకు ఇచ్చేయాలని ఏపి ప్రభుత్వం ముందు డిమాండ్ వినిపించాలని ప్రధాన కార్యదర్శికి కేసీఆర్ సూచించినట్టు వినవస్తోంది.
ఈనెల 27లోగా సచివాలయ సిబ్బందిని వెలగపూడికి తరలించి హైదరాబాద్‌లో నామమాత్రపు సిబ్బందిని మాత్రమే ఉంచాలని వీరికోసం ఎల్ బ్లాక్ ఉంచాలన్న చంద్రబాబు ఆలోచనకు తగ్గట్టుగానే వ్యవహరించి ఖాలీ అయ్యే ఏపి సెక్రటేరియట్ భవనాలను తెలంగాణ ప్రభుత్వం స్వాథీనం చేసుకునేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది.
.విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌లోని ఉమ్మడి రాష్ట్ర సచివాలయాన్ని రెండు రాష్ట్రాలూ పంచుకున్నందున ఇది ఉమ్మడి రాజధాని స్థలం కనుక దీనిని స్వాధీనం చేసుకోవాలంటే కేంద్రమే తాజా నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంటుంది.
తాజా నోటిఫికేషన్ జారీకి కేంద్రం నిరాకరిస్తే, విభజన చట్టంలోని సెక్షన్ 8(2) ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలతో గవర్నరు ఆ భవనాలను స్వాధీనం చేసుకుని తమకు అప్పగించే వీలుంటుందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఉమ్మడిలో తనకు అందిన వాటిని తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఏపి సిఎం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడంలేదని సచివాలయం అప్పగింత విషయంలో మెతకవైఖరి చూపిస్తే ఉమ్మడి రాజధానికి నీళ్లొదులుకొనే పరిస్థితికి కేసీఆర్ తమని నెట్టి వేయరన్న గ్యారంటీ లేదన్నది దేశం నేతల వాదన.
ఈ క్రమంలోనే వాటిని ఇవ్వద్దని, వివిధ చోట్ల ఉన్న ఏపి కార్యాలయాలన్నింటినీ అక్కడికి తరలించడం ద్వారా మరింత ఉపసమనం పొందేలా చంద్రబాబు తగిన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.







