పవన్‌ మూవీ.. రాజకీయాల కోసమే అంటున్నాడు!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లి పోయాడు.గత కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ తాజాగా మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే విషయమై పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 Ram Talluri And Pawan Kalyan Movie About Political Career Of Pawan-TeluguStop.com

అయితే అది ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా కాకుండా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి.పవన్‌కు ఆప్త మిత్రుడు అయిన రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో ఈ పొలిటికల్‌ డ్రామా తెరకెక్కబోతుందట.

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ ఇమేజ్‌ను పెంచే విధంగా ఆ సినిమా ఉండబోతుంది అంటూ సమాచారం అందుతోంది.రికార్డు స్థాయిలో అంచనాలున్న పవన్‌ మూవీలో మరో మెగా హీరో కూడా కనిపించబోతున్నాడు.

మెగా బ్రదర్‌ తనయుడు వరుణ్‌ తేజ్‌ లేదా మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ అయినా ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.పవన్‌ కళ్యాణ్‌ ఈ చిత్రంలో సెకండ్‌ హాఫ్‌లో మాత్రమే కనిపిస్తాడట.అయినా కూడా సినిమా మొత్తం కూడా ఆయన చుట్టు తిరుగుతుందని చెబుతున్నారు.స్టోరీ లైన్‌ సిద్దమయ్యిందని, త్వరలోనే సినిమాను పట్టాలెక్కిస్తామని చిత్ర నిర్మాత సన్నిహితలకు చెబుతున్నాడు.

2019 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్న విషయం తెల్సిందే.ఆ ఎన్నికల కంటే ముందే పవన్‌ మూవీ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాడు.రాజకీయ మైలేజ్‌ పెంచేందుకు పవన్‌ ఈ మూవీ చేయాలని నిర్ణయించుకున్నాడు.దాంతో పాటు ఆర్థిక అవసరాలకు కూడా ఈ చిత్రంతో వచ్చే పారితోషికం ఉపయోగపడుతుందని పవన్‌ భావిస్తున్నాడట.

వచ్చే నెలలోనే ఈ చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.చిన్న మెగా హీరోతో పవన్‌ కళ్యాణ్‌ మల్టీస్టారర్‌ ఎలా ఉంటుందో అంటూ ఇప్పటి నుండి మెగా ప్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube