ఏపీ ఫలితాలపై జగన్ నమ్మకమిదే.. వాళ్ల ఓట్లతో జగన్ చరిత్ర తిరగరాయనున్నారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరో 96 గంటల సమయం మాత్రమే ఉంది.ఈ 96 గంటల తర్వాత ఏపీ సీఎం ఎవరో తేలిపోనుంది.

రాష్ట్రంలోని 70 శాతం ప్రజలు ఇప్పటికే జగన్ సీఎం( Jagan CM ) అని ఫిక్స్ అయ్యారు.ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.

ఐదేళ్ల క్రితం జగన్ ఇదేరోజు జగన్ ప్రమాణ స్వీకారం చేశారు.వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావడంతో జగన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి ఫ్యామిలీకి మన పార్టీ మంచి చేసిందని ప్రజలందరి దీవెనలతో మన ప్రభుత్వం మళ్లీ ఏర్పాటు కానుందని జగన్ చెప్పుకొచ్చారు.ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకు మన ప్రభుత్వం వేస్తుందంటూ జగన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

ప్రజలందరి దీవెనలతో మన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని జగన్ నమ్మకం వ్యక్తం చేశారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా వైసీపీ మరిన్ని అడుగులు ముందుకు వేస్తుందంటూ జగన్ చేసిన కామెంట్స్ వైసీపీ అభిమానులలో జోష్ నింపుతున్నాయి.జగన్ మరోసారి సీఎం అయితే వాలంటీర్ల వ్యవస్థ( Volunteer System ) కొనసాగడంతో పాటు ప్రజలకు నేరుగా పథకాలు అందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.వైసీపీ పాలనలో విద్యావ్యవస్థ( Education System ) రూపు రేఖలు సైతం మారిపోయాయి.

జగన్ స్థాయిలో సంక్షేమ పథకాలను( Welfare Schemes ) అందించిన మరో నేత ఎవరూ లేరని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల జీవితాలను మార్చిన నేత జగన్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.జగన్ మార్క్ పాలన ఎంతో నచ్చడంతో మళ్లీ ఆయన పాలనకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తమ ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలను పొందిన వాళ్ల ఓట్లతో జగన్ చరిత్ర తిరగరాయనున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నయనతారతో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు