హరిహర వీరమల్లులో రాకుమారి పాత్రలో జాక్వలిన్ ఫెర్నాండెజ్

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాని ఏఏం రత్నం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నాడు.

ఇక మొఘలాయిల కాలం నాటి కథాంశంగా ఇది తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ లుక్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొదటి సారి కంప్లీట్ డిఫరెంట్ జోనర్ లో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.మళ్ళీ వీలైనంత వేగంగా షూటింగ్ స్టార్ట్ చేయడానికి క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement

సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకులకి అందించాలని క్రిష్ టార్గెట్ పెట్టుకున్నారు.ఈ నేపధ్యంలో కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసే అవాకాశం ఉందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇందులో నిధి అగర్వాల్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ కొంత క్లారిటీ ఇచ్చింది.

హరిహర వీరమల్లు సినిమాలో తాను రాకుమారి పాత్రలో కనిపిస్తానని చెప్పింది.పవన్ కళ్యాణ్ కి జోడీగా చేయడం చాలా సంతోషంగా ఉందని, కరోనా సిచువేషన్ కంట్రోల్ అయిన వెంటనే షూటింగ్ లో జాయిన్ అవుతానని జాక్వలిన్ ఫెర్నాండెజ్ చెప్పుకొచ్చింది.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు