దర్శకుడుగా మారబోతున్న జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలా మంది నటులు వెలుగులోకి వచ్చారు.అలాగే వెండితెరపై కూడా అవకాశాలు పెంచుకున్నారు.

కృష్ణా నగర్ లో సినిమా అవకాశాలు అంటూ తిరిగే వారికి జబర్దస్త్ మంచి ప్లాట్ ఫాం అయ్యింది.మంచి టాలెంటెడ్ నటులు కమెడియన్స్ గా పరిచయం అయ్యారు.

షకలక శంకర్ లాంటి నటులు స్టార్ కమెడియన్స్ అయిపోయారు.అలాగే హీరోగా కూడా సత్తా చాటాడు.

అలాగే ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా ఉన్న సత్య కూడా జబర్దస్త్ ద్వారానే కెరియర్ గుర్తింపు పెంచుకున్నాడు.ఇక జబర్దస్త్ నుంచి ప్రసన్న కుమార్ లాంటి రైటర్ కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

అలాగే శంకర్ టీంలో చేసే ఇంకో కమెడియన్ దర్శకుడుగా మారాడు.ఇప్పుడు అదే దారిలో మరో కమెడియన్ దర్శకుడుగా మారి మెగా పట్టుకోవడానికి రెడీ అయ్యాడు.

అతనే కిర్రాక్ ఆర్పీ.జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం జీతెలుగు అదిరింది షో ద్వారా అలరిస్తున్న ఆర్పీ ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నాడు.

అతడు చెప్పిన కథ నచ్చి సినిమా తీయడానికి ఒక నిర్మాత ముందుకు వచ్చారు.దీంతో ఆర్పీ తాత్కాలికంగా నటనకు విరామం ఇచ్చి ఆ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా ఆర్పీ తాను దర్శకుడు కావాలని ఇండస్ట్రీలోకి వచ్చి అనుకోకుండా నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపాడు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి మాత్రమేనా.. వరుసగా 8 హిట్లు సాధించారుగా!

ఇప్పుడు అనుకున్న విధంగానే దర్శకుడుగా తన అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు