జబర్దస్త్ రామ్ ప్రసాద్ కు క్యాన్సర్ సోకిందా.. ఆ క్యాప్ పెట్టుకోవడంతో?

జబర్దస్త్ షో ఊహించని స్థాయిలో సక్సెస్ కావడంలో రామ్ ప్రసాద్ పాత్ర కూడా కొంతమేర ఉందనే సంగతి తెలిసిందే.

రామ్ ప్రసాద్ వేసే ఆటో పంచ్ లకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తన పంచ్ లు ఉండే విధంగా రామ్ ప్రసాద్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే గత కొన్నిరోజులుగా రామ్ ప్రసాద్ కు క్యాన్సర్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తలు తన దృష్టికి రావడంతో రామ్ ప్రసాద్ స్పందించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఆటో రామ్ ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ తరహా ప్రచారం జోరుగా జరిగింది.

నాకు క్యాన్సర్ అని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆటో రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.నేను తలకు క్యాప్ పెట్టుకున్నానని ఆ క్యాప్ వల్ల ఈ ప్రచారం జరిగిందని ఆయన అన్నారు.

Advertisement

నాకు ఏం జరగలేదని కేవలం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నానని ఆ రీజన్ వల్లే నేను క్యాప్ పెట్టుకోవాల్సి వచ్చిందని ఆటో రామ్ ప్రసాద్ కామెంట్ చేశారు.రామ్ ప్రసాద్ వివరణతో నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లు ఇకనైనా సైలెంట్ అవుతారేమో చూడాల్సి ఉంది.మరోవైపు సుధీర్ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కాంబినేషన్ లో స్కిట్లు ప్రసారమైతే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో స్కిట్లు వస్తాయేమో చూడాల్సి ఉంది.గతంతో పోల్చి చూస్తే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు రేటింగ్స్ తగ్గుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు