సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారిపోయిన జబర్దస్త్ కమెడియన్... ఫోటోలు వైరల్!

ఒకప్పుడు లింగ మార్పిడి అంటే అదొక పెద్ద నేరంగాను తప్పగాను భావించేవారు.

ప్రస్తుతం లింగమార్పిడి అనేది సమాజంలో సర్వసాధారణం అయింది దీంతో చాలామంది వారికి నచ్చిన విధంగా వారు జీవించడానికి ఇష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు గాను అబ్బాయిలు అమ్మాయిలుగాను మారుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి కమెడియన్స్ కూడా ఏకంగా సర్జరీల ద్వారా అమ్మాయిలుగా మారిపోయి అందరికి షాక్ ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంది అబ్బాయిలు లేడీ గెటప్స్ వేయటం వల్ల చాలా మంది సర్జరీ చేయించుకుని నిజంగానే అమ్మాయిలుగా మారిపోయారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సాయి తేజ ( Sai Teja ) ఎన్నో లేడీ గెటప్స్ వేసి అనంతరం సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారారు.ఇప్పుడు ఈమె ప్రియాంక సింగ్ ( Priyanka Singh ) గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.అయితే ఈమె బాటలోనే మరొక కమెడియన్ కూడా సర్జరీ చేయించుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

Advertisement

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతున్నటువంటి సాయి ( Sai ) సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిపోయారని వార్తలు వచ్చాయి.ప్రస్తుతం సాయి అమ్మాయిగా ఉన్నటువంటి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్ కార్యక్రమంలో ఎన్నో స్కిట్లలో అమ్మాయిగా నటించినటువంటి సాయి సర్జరీ చేసుకొని అమ్మాయిలాగే మారిపోయారు అంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఇదే విషయం గురించి సాయిని ప్రశ్నించడంతో తాను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని కాకపోతే తనకు అమ్మాయిగా బ్రతకడం చాలా ఇష్టం అని తెలిపారు.చిన్నప్పటినుంచి చీరలు కట్టుకోవడం నాకు ఎంతో ఇష్టం అందుకే ఇలా అమ్మాయిగా చీరలు కట్టుకొని నాకు నచ్చిన విధంగానే నేను బ్రతుకుతున్నానని అయితే నేను సర్జరీ చేయించుకున్నానా లేదా అనేది ఇతరులకు అనవసరం అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు.

ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

'డాకు మహారాజ్ ' సినిమా ట్రైలర్ లో బాబీ చేసిన తప్పు ఏంటో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు