బ్యాచలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసిన జేడీ

తెలుగు సినీ పరిశ్రమకు శివ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నిర్మాత,డైరెక్టర్ అవతారాలు ఎత్తి తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

అయితే తెలుగులో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాలీవుడ్ కి వెళ్ళాడు.

అయితే అక్కడ పరాజయాలు పలకరించడంతో మరల టాలీవుడ్ కి వచ్చి సినిమాలు చేసినా సక్సెస్ కాలేకపోయాడు.చాలా రోజుల నుంచి చక్రవర్తి పెళ్లి వార్తలు వచ్చినా అందరు నిజమా కాదా అన్న అనుమానంలో ఉన్నారు.

వాటికీ బ్రేక్ చెప్పుతూ ఒక ఇంటివాడు అయ్యాడు.ఆర్జీవీ సావిత్రి సినిమా ఫేం అనుక్రితి శర్మను వివాహమాడాడు.

ఇక జేడీ వ్యక్తిగత జీవితానికి వస్తే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలా జాలీగా ఉండేవాడు.అంతేకాక చక్రవర్తిపై వర్మ ప్రభావం ఎక్కువగా ఉండేది.

Advertisement

పెళ్లి కన్నా ఒంటరిగా ఉండటమే బెటర్ అని వాదించేవాడు.ఏది ఏమైనా 46 సంవత్సరాల వయస్సులో బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి అనుక్రితి మెడలో మూడు ముళ్ళు వేశాడు జెడీ.

అయితే ఈ పెళ్లి కూడా ఆయన స్టయిల్ లోనే జరిగింది.స్నేహితులకి , బంధువులను ఎవరిని పిలవలేదు.

సైలెంట్ గా ఓ హోటల్ డిన్నర్ కి వెళ్ళినట్లు ఇరు కుటుంబాల మధ్యే జెడి పెళ్లి జరిగిపోయింది.

న్యూస్ రౌండప్ టాప్ 20 
Advertisement

తాజా వార్తలు