మీకు ఉండే ఈ అలవాట్లే కిడ్నీలకు ముప్పు పెంచుతాయి.. జాగ్రత్త!

ఇటీవల రోజుల్లో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.కిడ్నీ వ్యాధుల కారణంగా శారీరకంగానే కాదు ఆర్థికంగా కూడా నలిగిపోతుంటారు.

అందుకే కిడ్నీల ఆరోగ్యం విషయంలో కచ్చితంగా ప్ర‌త్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.అలాగే మనకు ఉండే కొన్ని కొన్ని అలవాట్లే కిడ్నీలకు ముప్పు పెంచుతాయి.

మరి ఇంతకీ ఆ అలవాట్లు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు.

అంటే ప్రతిరోజు ప్రతి పూట నాన్ వెజ్( Non-Veg ) ఉండాల్సిందే.కానీ ఈ అలవాటు మీ కిడ్నీలను పాడయ్యేలా చేస్తుంది.

Advertisement

నాన్ వెజ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.ప్రోటీన్ మనకు మంచిదే.

కానీ అధిక మొత్తంలో తీసుకుంటే అదే విషంగా మారుతుంది.ముఖ్యంగా కిడ్నీలపై( Kidney problem ) తీవ్ర ప్రభావం పడుతుంది.

కిడ్నీ స్టోన్స్, కిడ్నీ పనితీరు నెమ్మదించడం వంటి సమస్యలు ఏర్పడతాయి.అందుకే నాన్ వెజ్ ను వారంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి.

కొందరు ఉప్పు( Salt )ను చాలా అధికంగా తీసుకుంటారు.మీకు ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.ఉప్పులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఇది మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.ధూమపానం, మద్యపానం.

Advertisement

ఇవి రెండు అలవాట్లు మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తాయి.

కొందరు మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు.అయితే గంటల తరబడి మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రాశయం నిండిపోతుంది.దీని కారణంగా మూత్రశయం తో పాటు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.

కొందరు చిన్న నొప్పి వచ్చిన వెంటనే పెయిన్ కిల్లర్ ను వేసేసుకుంటారు.ఈ అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది.

అలా తరచూ పెయిన్ కిల్లర్ ను వేసుకుంటే కిడ్నీల ఆరోగ్యం తీవ్రంగా పాడవుతుంద‌ని చెబుతున్నారు నిపుణులు.కాబట్టి ఇకనైనా జాగ్రత్త వహించండి.

ఈ అలవాట్లను మానుకోండి.మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

తాజా వార్తలు