నేతన్నల బకాయిలను విడుదల చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే..: మంత్రి పొన్నం

కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Congress Minister Ponnam Prabhakar ) కీలక వ్యాఖ్యలు చేశారు.

నేతన్నలను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీయే( Congress Party )నని తెలిపారు.

చేనేత బోర్డును బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని పేర్కొన్నారు.బీజేపీ నేత బండి సంజయ్( BJP Leader Bandi Sanjay ) ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమిటని ప్రశ్నించారు.

కానీ కాంగ్రెస్ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా జీవోను తీసుకువచ్చిందని వెల్లడించారు.అంతేకాకుండా నేతన్నల బకాయిలను విడుదల చేసే బాధ్యత కూడా తమదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Advertisement
తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్...

తాజా వార్తలు