టీడీపీ వైసీపీ కాంగ్రెస్ ! రఘువీరా ఆప్షన్ ఏంటి ?

రాజకీయాలకు పూర్తిగా విరామం ప్రకటించి చేసి , పూర్తి అజ్ఞాతవాసంలో గడుపుతున్నట్లు గా వ్యవహరిస్తున్న  మాజీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలకమైన మంత్రి పదవులను చేపట్టిన రఘువీరారెడ్డి మళ్లీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తున్నారు.

గత కొద్ది రోజులుగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది .

రఘువీరా రెడ్డిని ఏదోరకంగా యాక్టివ్ చేసి మళ్లీ కాంగ్రెస్ కు జవసత్వాలు తీసుకురావాలనే విధంగా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.అదే సమయంలో వైసీపీ నుంచి ఆయనకు భారీగానే ఆఫర్ లు వస్తున్నాయి.

రఘువీరాకు ఏదో ఒక రకమైన పదవి అప్పగించడం తోపాటు, రాజకీయంగా మంచి ప్రాధాన్యం ఇస్తాం అంటూ వైసీపీ నుంచి ఒత్తిడి వస్తోంది.రఘువీరా రెడ్డి వంటి సీనియర్ ను చేర్చుకోవడం ద్వారా,  రాజకీయ సమీకరణాలు తప్పకుండా తమకు అనుకూలంగా మారతాయి అని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాదవ సామాజిక వర్గం అంతా ఒక తాటిపైకి తీసుకువచ్చి తమకు అనుకూలంగా రాజకీయం నడిపించగల రని జగన్ సైతం నమ్ముతున్నారు.

 అందుకే రఘువీరాను పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను సీనియర్ పొలిటిషన్ రఘు వీరాకు సన్నిహితుడిగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు.ఇది ఇలా ఉండగానే టిడిపి సైతం రఘువీరా కోసం కాచుకుని కూర్చుంది.

Advertisement

ఇప్పటికే అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రఘువీరా ను కలిశారు.అనేక రాజకీయ అంశాలపై చర్చించారు రఘువీర సొంత ఊరు నీలకంటాపురం వెళ్లి మరి ఆయనతో మంతనాలు చేశారు.

అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రఘువీరా వ్యవహారాన్ని మెచ్చుకుంటూ ఆయన చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు,  వ్యవసాయం తదితర అంశాలపై ఆయన ప్రశంసించారు.దీంతో ఆయనను మళ్ళీ టిడిపి వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అనే అనుమానాలు మొదలయ్యాయి.

అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రఘువీరా విషయంలో చాలా ఆశలే పెట్టుకుంది.ఆయన వస్తే తెలంగాణలో కాంగ్రెస్ లో కాస్త ఊపు వస్తుందని ప్రస్తుతం రఘువీరా పై సెంటిమెంటు ఉంది అని, అవన్నీ తమకు కలిసి వస్తాయని ఆశ పడుతోంది.

 అయితే మొన్నటి వరకు అసలు రాజకీయాల్లోకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపని రఘువీరా ప్రస్తుతం మాత్రం పొలిటికల్ గా యాక్టివ్ అవ్వాలి అని చూస్తున్నారు.అయితే ఆయన టిడిపి , కాంగ్రెస్ వైసీపీ లలో ఏ పార్టీలో చేరుతారా అనేది ఆయన అనుచరులకు కాస్త టెన్షన్ పుట్టిస్తోంది.

జగన్ మద్దతు ఇవ్వకపోతే... బీజేపీ టార్గెట్ వారే ?
Advertisement

తాజా వార్తలు