బండి సంజయ్ పాదయాత్ర నిర్ణయం వెనుక అసలు వ్యూహం ఇదే?

తెలంగాణలో బీజేపీ ఎప్పటి నుండో ఉన్నా సంస్థాగతంగా అంతగా బలపడిన పరిస్థితి లేదు.

అప్పటి వరకు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి వ్యక్తులు అధ్యక్షులుగా పనిచేసినా స్థానికంగా బలోపేతం కాలేదు.

కాని బండి సంజయ్ టీడీపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణలో బీజేపీ ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసి పడ్డ విషయం తెలిసిందే.అయితే దుబ్బాక ఉప ఎన్నికలు మొదలుకొని జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే.

అయితే ఆ తరువాత టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు భావించిన విషయం తెలిసిందే.అయితే త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇక త్వరలో సార్వత్రిక ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో స్థానిక సమస్యలను.

టీఆర్ఎస్ వైఫల్యాలను రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తీసుకరావడమే బండి సంజయ్ ప్రధాన వ్యూహంలా కనిపిస్తోంది.లేకపోతే బీజేపీని మరింత ప్రజా బలాన్ని సాధించుకునే దిశగా కృషి చేయాలంటే పాదయాత్ర నే ప్రధాన అస్త్రంగా బండి సంజయ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.అంతేకాక పాదయాత్ర వలన స్థానిక కార్యకర్తలకు భరోసాను ఇచ్చే అవకాశం కలుగుతుంది.

Advertisement

ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో బండి సంజయ్ పాదయాత్ర పై సర్వత్రా చర్చ జరుగుతోంది.మరి పాదయాత్ర చేపట్టిన తరువాత ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు