విదేశాల్లో భారతీయ విద్యార్ధులకు ఇంత డిమాండ్ ఉందా...!!!!

భారత దేశం నుంచీ ఎంతో మంది ఎన్నో ఏళ్ళ క్రితమే వలసలు వెళ్లి పలు దేశాలలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండిపోయారు.

విద్యా, వైద్యం, శాస్త్ర, సాంకేతిక రాజకీయ ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రంగాలలో కీలక స్థానాలలో పదవులు అధిరోహిస్తూ ఉన్నత స్థితికి చేరుకున్నారు.

అయితే భారతీయ నిపుణులను కలిగిన ఆయా దేశాలు ఆర్ధికంగా ఎంతో నిలదొక్కుకున్నాయి కూడా.ఈ పరిస్థితికి కారణం భారతీయులలో ఉన్న అపారమైన మేధా శక్తి.

భారత్ లో కొందరు భారత్ లో చదువు ముగించుకుని ఉద్యోగం కోసం విదేశాలు వెళ్తే, మరికొందరు మాత్రం విదేశాలలో ఉన్నత విద్య కోసం వెళ్లి అక్కడే స్థిరపడుతున్నారు.ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యంలో భారతీయుల హవా ఎక్కువగా కన్పిస్తుంది.

అక్కడ ఏ రంగంలోనైనా సరే మన వారిది అగ్ర తాంబూలమే.భారత్ నుంచీ వెళ్ళిన విద్యార్ధులే నేడు అక్కడ ఉన్నత స్థితిలో ఉన్నారు, అగ్ర రాజ్య హోదాలో మన వారు కీలక భాగస్వాములు అయ్యారు.

Advertisement

ఈ పరిస్థితిని గమనించిన ఇతర దేశాలు భారతీయ విద్యార్ధులు తమ దేశంలో కూడా విద్యని అభ్యసించి ఉద్యోగాలు పొందే అవకాశాలు కల్పిస్తూ వచ్చాయి.అయితే అమెరికా స్థాయిలో ఏ దేశం భారతీయ విద్యార్ధులను ఆకర్షించ లేకపోయింది.

కానీ తాజాగా అమెరికాతో బ్రిటన్ పోటీ పడుతోంది.భారతీయ విద్యార్ధులను ఆకర్షించే క్రమంలో త్వరతిత గతిన శాశ్వత హోదా కల్పించడమే కాకుండా భారతీయ విద్యార్ధులకోసం ఆకర్షణీయమైన పధకాలను అందిస్తోంది.

దాంతో బ్రిటన్ వెళ్ళే భారతీయ విద్యార్ధుల సంఖ్య ఒక్క సారిగా పెరిగిపోయింది.ప్రస్తుతం ఆస్టేలియా సైతం ఈ రెండు దేశాల ఫార్ములానే ఫాలో అవుతోంది.

అక్కడి ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ డా.మోనికా కెన్నడీ భారత్ వచ్చిన సందర్భంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.భారతీయ గ్రాడ్యుయేట్ల కోసం ఆస్ట్రేలియా నూతన వీసా విధానాన్ని తీసుకువస్తోందని అన్నారు.ఇందులో భాగంగానే ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసా రీ ఫండ్ తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాల పునరుద్దరణ, వంటి పలు కీలక అంశాలకు తమ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు.2022 జనవరి 19 నుంచీ మార్చి 19 వరకూ ఎవరైతే వీసా పొందారో వారు మాత్రమే స్టూడెంట్ వీసా రీ ఫండ్ కు అర్హులు అవుతారని తెలిపారు.ఈ రీ ఫండ్ ను 2022 డిసెంబర్ 31 వరకూ క్లెయిమ్ చేసుకోవచ్చునని ఆయన ప్రకటించారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు