మత్తు మందు తర్వాత బిడ్డకి పాలిస్తే ఏం అవుతుందో తెలుసా?

దేశంలో కరోనా మహమ్మారి, ఇతర వ్యాధులు శరవేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.వైద్యులు, శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు.

సాధారణంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి వివిధ ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.అయితే కొన్ని రకాల వ్యాధులు సోకకుండా తల్లిపాలు రక్షిస్తాయి.

Breast Feeding, Anaesthesia, Health Tips, Is Breast Feeding Safe After Anaesthes

పిల్లలకు తల్లిపాలు ఎంతో ఆరోగ్యం.అయితే చాలామందిని బిడ్డ పుట్టిన తరువాత తల్లికి మత్తు ఇస్తే తల్లి పాలు ఇవ్వవచ్చా.? ఇవ్వకూడదా.? అనే సందేహం వేధిస్తూ ఉంటుంది.అయితే ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం తల్లి మెలుకువగా ఉండి పాలివ్వగలిగే స్థితిలో ఉంటే పాలు ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం జరగదు.

మత్తు మందు ఇచ్చిన తరువాత తల్లి పాలు తాగిన పిల్లల్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించలేదని పరిశోధకులు చెప్పారు.తల్లికి పూర్తిగా మెలుకువ రాకముందే పాలు ఇస్తే మాత్రం తప్పనిసరిగా బిడ్డ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

Advertisement

పరిశోధకులు తల్లికి మత్తు ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్య ఉండదని అయితే తల్లీబిడ్డలను జాగ్రత్తగా చూసుకునే వాళ్లు తప్పనిసరిగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.పిల్లలకు ఇచ్చే కొన్ని మందుల విషయంలో, బిడ్డకు 45 రోజులు నిండేంత వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.

పిల్లల నిద్ర, ఊపిరికి సంబంధించిన విషయాల గురించి దృష్టి పెట్టాలని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు