పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేస్తున్న ఏ ఏం రత్నం కొడుకు... వర్కౌట్ అవుతుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా గత నాలుగు సంవత్సరాల కిందట క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు( Harihara Veeramallu ) అనే సినిమా మొదలైంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అనేది చాలా రోజుల నుంచి పెండింగ్ పడుతూ వస్తుంది.

ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో చాలా బిజీగా ఉండటం వల్ల సినిమా షూటింగ్ ను ఆపివేయడం జరిగింది.ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే డైరెక్టర్ క్రిష్( Director Krish ) ఈ సినిమా నుంచి తప్పుకోవడం అనేది నిజంగా సినిమా యూనిట్ తో పాటు, పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే ఈ సినిమా లేటవుతుందనే నేపథ్యంలోనే తను ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా క్రిష్ ఒక వివరణ కూడా ఇచ్చాడు.అయితే ఇలాంటి గ్రామాల్లో ఈ సినిమాని ఎవరు డైరెక్షన్ చేస్తారు అనే విధంగా కొన్ని వార్తలైతే వచ్చాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఏ ఏం రత్నం( MM Ratnam ) కొడుకు అయిన జ్యోతి కృష్ణ( Jyoti Krishna ) డైరెక్షన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఇప్పటికే జ్యోతి కృష్ణ నా మనసు నీకు తెలుసు, ఆక్సిజన్ లాంటి సినిమాలను డైరెక్షన్ చేశాడు.అయితే వాటిలో ఏ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోవడం విశేషం.

Advertisement

మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఈ సినిమా అయిన మంచి విజయాన్ని సాధిస్తుందా దర్శకుడుగా తన సత్తా చాటుకుంటాడా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.ఇక మొత్తానికైతే ఈ ప్రాజెక్టు మీద పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతవరకు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.చూడాలి మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది.

ఇక జ్యోతికృష్ణ కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకు మాత్రం ఆయన దర్శకుడిగా మంచి పేరు అయితే సంపాదించుకుంటారు అలా కాకుండా సింహాన్ని ఎంగేజింగ్ గా తీయలేక పోతే మాత్రం అయిన చాలా విమర్శ లను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Advertisement

తాజా వార్తలు