17వ పోలీస్ బెటాలియన్ లో గణంగ జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ పరిధి అయినటువంటి సర్దాపూర్ నందు గల 17వ పోలీస్ బెటాలియన్ లో బెటాలియన్ కమాండెంట్ ఎస్.శ్రీనివాస రావు జాతీయ జెండా ఎగురవేసి పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

 Telangana Formation Day Celebrations Held At 17th Police Battalion, Telangana Fo-TeluguStop.com

ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ ఎస్.శ్రీనివాస రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం అయిన రోజు అని,ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.1969లో తొలిదశ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది.

ఓయూలో విద్యార్థుల పోరాటం, కొందరు ఉద్యమకారుల మరణంతో ఉద్యమం ఉవ్వెత్తున పైకి లేచింది.తర్వాత మరుగునపడిపోయింది.ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గొంతెత్తి నినాదించారు.ఈ సమయంలోనే 2001 లో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవీకి రాజీనామా చేసి.

మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేసారు.జయశంకర్ సార్, కొండ లక్ష్మణ్ బాపూజీ, లాంటి మహా వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేశారని వారి కృషి ఫలితంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని తెలియజేశారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం సదర్భంగా ఆర్.ఐ.నారాయణ కి ఉత్తమ సేవ పతకంను 17వ బెటాలియన్ కమాండెంట్ ఎస్.శ్రీనివాస రావు చేతుల మీదుగా అందజేసి ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ రాందాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube