లాక్ డౌన్ కొనసాగించే యత్నాలు చేస్తున్న కేంద్రం.. మరి ప్రజలు ఒప్పుకుంటారా..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోన్న సంగతి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.

దీంతో ఈ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇందులోభాగంగా ఇప్పటికే అత్యవసర లాక్ డౌన్ విధించి ప్రజలను అవసరమైతే తప్ప బయట సంచరించ వద్దంటూ ఆంక్షలు విధించడంతో పాటు, సామాజిక దూరం పాటించాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు.అయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఉన్నట్లుండి గత నెల 23వ తారీకు నుంచి ఈ నెల 14 వ తారీకు వరకు లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో ప్రస్తుతం రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో ఈనెల 14న ముగియాల్సిన లాక్ డౌన్ మే 7వ తారీకు వరకు కొనసాగించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది.అయితే తాజాగా ఈ విషయంపై మరోమారు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా లాక్ డౌన్ మరింత కాలం పాటు పొడిగించేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం.దీనికితోడు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇందుకు సమ్మతంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

అంతేగాక ఒకవేళ లాక్‌డౌన్‌ పొడిగించినప్పటికీ పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సహాయ సహకారాలు కూడా అందిస్తామని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.ఈ విషయాలను బట్టి చూస్తే మరింత కాలం పాటు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనబడుతున్నాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా లాక్ డౌన్ విధించడంతో రవాణా వ్యవస్థను నిలిపివేశారు.దీంతో ఉద్యోగాలు, పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలు, పట్టణాలు, నగరాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అంతేగాక వారికి ప్రభుత్వ అందించే  సహాయ సహకారాలు అందకపోవడంతో ఇప్పటికీ చాలామంది పస్తులతో నిద్రిస్తున్నారు.

దీంతో కనీసం ఇప్పటికైనా రెండు రోజుల పాటు రవాణా వ్యవస్థను తెరవాలని తమ సొంత గ్రామాలకు చేరుకునే వెసులుబాటు కల్పించాలని పలువురు దీనంగా రాష్ట్ర ప్రభుత్వాలను అర్తిస్తున్నారు.ఇప్పటికే ఈ రవాణా వ్యవస్థ స్తంభించిన కారణంగా కొందరు తమ తల్లిదండ్రుల అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయిన ఘటనలు ఇప్పటివరకు చాలానే చోటుచేసుకున్నాయి.

దీనికితోడు మద్యం దుకాణాలను ఉన్నపళంగా మూసివేయడంతో మందుబాబులు మద్యం దొరక్క అల్లాడుతున్నారు.అంతేగాక ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మద్యం దొరక్క విచక్షణ కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!
Advertisement

తాజా వార్తలు