కోన వెంకట్‌ మరో చెత్త పని!

గతంలో సక్సెస్‌ అయిన సినిమాల నుండి మొన్నటి వరకు సీన్స్‌ ఎత్తేసిన రచయిత కోన వెంకట్‌ ఇప్పుడు ఏకంగా టైటిల్స్‌ను ఎత్తేస్తున్నాడు.

ఈయన నిర్మాణంలో వచ్చిన మొదటి చిత్రం ‘గీతాంజలి’.

ఇది నాగార్జున నటించిన అద్బుత ప్రేమ కావ్యం.ఆ టైటిల్‌తో ఒక దెయ్యం సినిమా తీసి టైటిల్‌కే చెడ్డ పేరు తెచ్చాడు.

గతంలో ‘గీతాంజలి’ అనే పేరు వినిపించగానే అద్బుతమైన సంగీతం, ఇంకా అద్బుతమైన ప్రేమ కథ గుర్తుకు వచ్చేది.కాని ఇప్పుడు కోన నిర్మించిన అంజలి ‘గీతాంజలి’ గుర్తుకు వస్తుంది.

‘గీతాంజలి’ సక్సెస్‌ అవ్వడంతో అదే ప్రయత్నంగా ఓల్డ్‌ క్లాసిక్‌ మూవీ అయిన ‘శంకరాభరణం’ చిత్రాన్ని ఉదయ్‌ నందనవనం దర్శకత్వంలో నిర్మించాడు.‘శంకరాభరణం’ టైటిల్‌కు ఏమాత్రం న్యాయం చేయకపోవగా, అన్యాయం జరిగింది.

Advertisement

‘గీతాంజలి’, ‘శంకరాభరణం’ల మాధుర్యంను దెబ్బ తీసిన కోన మరో చెత్త పని చేసేందుకు సిద్దం అవుతున్నాడు.తెలుగు సినిమా చరిత్రలో తన కంటూ ఒక ప్రత్యేక పేజీలను ఏర్పర్చుకున్న ‘పాతళ భైరవి’ టైటిల్‌ను కోన తన సినిమాకు వాడేసుకునేందుకు ఫిల్మ్‌ ఛాంబర్‌లో అప్లై చేశాడు.

పాత టైటిల్స్‌ పెట్టడం వల్ల సినిమాపై ప్రేక్షకుల అటెక్షన్‌ ఏర్పడుతుందని, దాంతో సగం ప్రమోషన్‌ ఖర్చు లేకుండా జరిగి పోతుందనే ఉద్దేశ్యంతో కోన ఇలా చేస్తున్నట్లుగా క్లీయర్‌గా అర్థం అవుతుంది.కాని తన ప్రీ పబ్లిసిటీ కోసం తెలుగు ప్రేక్షకులు గొప్పగా చెప్పుకునే సినిమాల టైటిల్‌కు అన్యాయం చేయడం ఎంత వరకు న్యాయం అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

కోన ఇప్పటికి అయినా పిచ్చి ప్రయత్నాలు మాని సొంత తెలివితేటలతో ప్రవర్తించాలని కోరుతున్నారు.

కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్.. జేడీఎస్ ఆదేశాలు

Advertisement

తాజా వార్తలు