జగన్ కాన్ఫిడెన్సే.. నిజం అవుతోందా ?

ఏపీలో ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం మాత్రమే ఉంది.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలన్నీ కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి.

కాగా అధికార వైసీపీ మాత్రం మొదటి నుంచి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే వస్తోంది.అందుకే కేవలం గెలుపు మాత్రమే కాకుండా క్లీన్ స్వీప్ మన టార్గెట్ అంటూ జగన్ పదే పదే వారి పార్టీ నేతలకు చెబుతున్నారు.

మరి జగన్( Cm jagan ) ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ? జగన్ ఆశిస్తున్నట్లుగా 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకోవడం సాధ్యమేనా ? వేరే ఇతర పార్టీలకు ప్రజలు అవకాశం ఇవ్వరా ? అసలు జగన్ ది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా ? ఇలాంటి ప్రశ్నలు రాక మానవు.

కాగా జగన్ వైనాట్ 175 అనగానే అన్నీ వైపులా నుంచి కూడా జగన్ టార్గెట్ ను ఎద్దేవా చేశారు.175 ఏమో గాని ముందు అధికారం నిలుపుకో అంటూ విమర్శలు గుప్పించారు.ఎన్ని విమర్శలు ఎదురవుతున్నప్పటికి జగన్ మాత్రం తన టార్గెట్ 175 అండ్ 25 అనే చెబుతున్నారు.

Advertisement

ఇదిలా ఉంచితే తాజాగా టైమ్స్ నౌ నవ భారత్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికరమైన సర్వేను వెల్లడించింది.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరెన్ని సీట్లు కైవసం చేసుకుంటారని ఆ సర్వే ద్వారా వెల్లడించింది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మళ్ళీ బీజేపీనే అధికారం చేపట్టే అవకాశం ఉందట.

బీజేపీకి( BJP ) 292-338 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 106-144 సీట్లు వచ్చే అవకాశం ఉందట.ఇక ఏపీ విషయానికొస్తే వైసీపీ 24-25 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని టైమ్స్ నౌ సంస్థ వెల్లడించడం గమనార్హం.అంటే దాదాపుగా ఎం‌పి సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఆ సర్వే చెబుతోంది.

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్.జగన్ కాన్ఫిడెన్సే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజం కాబోతుందా అంటే ఈ సర్వేను బట్టి చూస్తే అవునేమో అనే సమాధానం వినిపిస్తోంది.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే టీడీపీ, జనసేన( TDP ) పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికి అంతిమంగా వైసీపీదే పై చేయి అవుతుందని జగన్ ధీమాగా ఉన్నారు.ప్రస్తుతం వస్తున్న సర్వేలను బట్టి చూస్తే జగన్ కాన్ఫిడెన్సే నిజం అవుతుందా అనే సందేహం రాక మానదు.

Advertisement

తాజా వార్తలు