వాళ్లు గర్వపడాలంటే ఇంకా సాధించాలి.... రష్మిక కామెంట్స్ వైరల్!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన రష్మిక మందన్న( Rashmika Mandanna ) అతి తక్కువ సమయంలోనే ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు.ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ( Pushpa ) ద్వారా ఈమె పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

 Actress Rashmika Mandanna About Parents,success,film Industry,rashmika Mandanna,-TeluguStop.com

ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.


ఈ విధంగా కెరియర్ పట్ల రష్మిక ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా( Social Media ) వేదికగా ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన తల్లిదండ్రుల( Parents ) గురించి పలు విషయాలను వెల్లడించారు.సినిమా ఇండస్ట్రీలో తాను ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ తన విషయంలో మాత్రం తన తల్లిదండ్రులు ఇంకా గర్వపడలేదని తెలిపారు.

ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళు చిత్రపరిశ్రమకు చాలా దూరంగా ఉన్నారు.నేను ఏం చేస్తున్నానో వారికి సరైన అవగాహన లేదు.ఇక నాకు ఇండస్ట్రీలో అవార్డులు వచ్చినప్పుడు సంతోషిస్తూ ఉంటారు.


ఇక చిన్నప్పటినుంచి తన తల్లిదండ్రులు తనకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా తన అన్ని అవసరాలను తీరుస్తూ వాళ్ళు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపారు.ఆ కష్టాలన్నీ నాకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయని అందుకే తన తల్లిదండ్రులు గర్వపడాలి అంటే ఇండస్ట్రీలో తాను సాధించాల్సింది ఇంకా ఉంది అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప 2 ( Pushpa 2 ) సినిమాతోపాటు, రెయిన్ బో,నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు.

అలాగే బాలీవుడ్ లో యానిమల్ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube