ఎండు ద్రాక్షను ఉదయం పూట తింటే ప్రమాదమా.. నిపుణులు ఏం చెబుతున్నారు?

ఇటీవల కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.పోషకాలతో కూడిన ఆహారాన్ని డైట్ లో చేర్చుకుంటున్నారు.

ఇందులో భాగంగానే ఉదయం గుప్పెడు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటున్నారు.బాదం, పిస్తా, వాల్ నట్స్, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ ను మార్నింగ్ టైమ్‌ లో తింటున్నారు.

ఆరోగ్యపరంగా డ్రై ఫ్రూట్స్ అపారమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి.అనేక జబ్బుల నుంచి రక్షిస్తాయి.

రోజంతా ఎనర్జిటిక్ గా ఉండడానికి అవసరమయ్యే శక్తిని అందిస్తాయి.

Is It Dangerous To Eat Raisins In The Morning Raisins, Raisins Health Benefits,
Advertisement
Is It Dangerous To Eat Raisins In The Morning? Raisins, Raisins Health Benefits,

అయితే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉదయం పూట తినడానికి సరైన ఎంపిక కాదు.ముఖ్యంగా ఎండు ద్రాక్షను( Raisins) ఉదయం పూట తినకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.ఎండుద్రాక్షలో విటమిన్లు, డైటరీ ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం మరియు మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఇతర పోషకాలు ఉంటాయి.

నిత్యం ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.ఎండు ద్రాక్షలో ఐరన్ రిచ్ గా ఉంటుంది.అందువల్ల రోజు ఎండు ద్రాక్షను తీసుకుంటే రక్తహీనత( Anemia ) కి దూరంగా ఉండవచ్చు.

Is It Dangerous To Eat Raisins In The Morning Raisins, Raisins Health Benefits,

అలాగే ఎండు ద్రాక్షలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను చురుగ్గా మారుస్తుంది.మలబద్ధకం సమస్యను తరిమి కొడుతుంది.అంతేకాదు నిత్యం ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కరుగుతుంది.

రక్తపోటు అదుపులో ఉంటుంది.గుండె జ‌బ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

చర్మం యవ్వనంగా నిగారింపుగా మెరుస్తుంది.ఇలా చెప్పుకుంటూ పోతే ఎండుద్రాక్ష వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి.

Advertisement

అయితే ఉదయం పూట ఎండు ద్రాక్ష తినకపోవడమే మంచిది అని అంటున్నారు.ఎండు ద్రాక్షలో చక్కెర ఎక్కువగా ఉంటుంది.

ఉదయం పూట ఎండు ద్రాక్షను నేరుగా తినడం వల్ల మధుమేహం వచ్చే రిస్క్ పెరుగుతుంది.వెయిట్ గెయిన్ అవుతారు.

అలాగే దంత క్షయం, కావిటీస్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.అందుకే ఉదయం పూట నేరుగా ఎండు ద్రాక్షను తీసుకోకూడదని చెబుతున్నారు.

ఒకవేళ మీరు తినాలి అనుకుంటే ఓట్ మీల్, స్మూతీలు, సలాడ్స్ వంటి ఆహారాలతో కలిపి తీసుకోవచ్చు.మరియు డీహైడ్రేట్ చేసి కూడా తీసుకోవచ్చు.

అంటే నైట్ అంతా వాటర్ లో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు.వాటర్ లో నానబెట్టడం వల్ల ఎండు ద్రాక్షలో చక్కెర మరియు ప్రిజర్వేటివ్ లు తగ్గుతాయి.

తాజా వార్తలు