ఆ కుటుంబంలో అందరూ ఐపీఎస్ లే.. అభిషేక్ మహంతి ఫ్యామిలీ చరిత్ర తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఒక కుటుంబంలో ఒక్కరు ఐపీఎస్( IPS ) సాధించాలంటే ఏ స్థాయిలో కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే కుటుంబం మొత్తం ఐపీఎస్ లు ఉంటే మాత్రం ఒకింత ఆశ్చర్యానికి గురి కావాల్సి ఉంటుంది.

అభిషేక్ మహంతి( Abhishek Mohanty ) కుటుంబంలో ఉన్నవాళ్లలో ఎక్కువమంది ఐపీఎస్ లు కావడం గమనార్హం.అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయంటే మాత్రం ఈ కుటుంబం గురించి తప్పకుండా గుర్తుకొస్తుంది.

అభిషేక్ మహంతి తండ్రి ఏకే మహంతి( AK Mohanty ) ఐపీఎస్ హోదాలో పని చేశారు.ప్రస్తుతం అభిషేక్ మహంతి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా పని చేస్తుండటం గమనార్హం.

సమర్థతో పాటు నిజాయితీ ద్వారా అభిషేక్ మహంతి ప్రశంసలను అందుకుంటున్నారు.గతంలో అభిషేక్ మహంతి కడప ఎస్పీగా, తిరుపతి అర్బన్ ఎస్పీగా కూడా పని చేయడం గమనార్హం.

Advertisement

అభిషేక్ సోదరుడు అవినాష్ మహంతి( Avinash Mohanty ) కూడా 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా ప్రస్తుతం సైబరాబాద్ లో ఆయన సంయుక్త పోలీస్ కమిషనర్ గా పని చేస్తున్నారు.

అభిషేక్ మహంతి తండ్రి అజిత్ కుమార్ మామయ్య దామోదర్ చోట్రాయ్ తొలి సివిల్ సర్వీస్ బ్యాచ్ కాగా ఒడిషా క్యాడర్ అధికారిగా పని చేశారు.అజిత్ కుమార్ మహంతి బావమరిది పీకే సేనాపతి( PK Senapathy ) 1967 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కావడం గమనార్హం.ఒకే కుటుంబంలో ఇంతమంది ఐపీఎస్ అధికారులు( IPS Officers ) ఉండటం నెటిజన్లన్ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ కుటుంబం యంగ్ జనరేషన్ కు చెందిన ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.

అభిషేక్ మహంతి మాట్లాడుతూ మా నాన్న చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పుకొచ్చారు.నాన్న నమ్మిన దానికోసం పని చేస్తూ ముందుకు సాగారని ఆయన తెలిపారు.నాన్న పనితీరు స్టాండర్డ్ గా ఉంటుందని అభిషేక్ మహంతి తెలిపారు.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన

అభిషేక్ మహంతి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు