పోలె అదిరిపోలే.. కాలం తగ్గట్టుగా వినూత్న ఆలోచనతో వెరైటీ వెడ్డింగ్ కార్డు..

ప్రస్తుతం పెళ్లిళ్లు( Marriages ) జరిగే తీరు పూర్తిగా మారిపోయింది.ఇదివరకు కాలంలో వచ్చమా.

పెళ్లి చూసామా.పలకరించామా.

భోజనం చేశామా.వెళ్ళిపోయామా.

అనేలా కాకుండా ఇప్పుడు పెళ్లి రూపు రేఖలను పూర్తిగా మార్చేశారు.ఇప్పటి పెళ్ళిలో ముఖ్యంగా.

Advertisement

ఎలాంటి భోజనాలు పెట్టారు.? ఎంత డెకరేషన్ చేసారు.? గిఫ్ట్ లు ఏమి ఇచ్చారు.? లాంటి విషయాలతో పెళ్లి కార్యక్రమాలు నడుస్తున్నాయి.అందుకు తగ్గట్టుగానే చాలామంది భారీగా ఖర్చుపెట్టి పెళ్లి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ముఖ్యంగా పెళ్లికి పిలవడానికి పెళ్లి కార్డు( Wedding Card ) నుంచి పెళ్లికి వచ్చిన వారికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ వరకు ప్రతిదీ కొత్తగా ఉండాలని ఆలోచనలతో వెళ్లి కుటుంబ సభ్యులు తెగ ఆలోచనలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు చాలా వీడియోలు ఫోటోలు పెళ్లిళ్లకు సంబంధించిన వి వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ లిస్టులకే మరో కొత్త వెడ్డింగ్ కార్డ్ చేరింది.విశాఖపట్నంలో( Vishakapatnam ) కాబోయే జంట ఐఫోన్ బ్యాగ్రౌండ్ మాదిరిగా ఓ ప్రత్యేకమైన వెడ్డింగ్ కార్డ్ ఇన్విటేషన్ కార్డును రూపొందించారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ వెడ్డింగ్ కార్డు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కరెక్టేనా... రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచిన నాగబాబు!
అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. విష్ణుప్రియ వీడియో వైరల్..

ఇంస్టాగ్రామ్ లో లక్ష్మణ్ వెడ్డింగ్ కార్డ్స్( Laxman Wedding Cards ) అనే పేజీ ద్వారా పెళ్లి ఆహ్వానానికి సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఆ వీడియో ట్రెండింగ్ మారింది.ఈ వైరల్ వీడియోలో ఐఫోన్ ను( Iphone ) పోలి ఉన్న వెడ్డింగ్ ఇన్విటేషన్ను చూపించారు.

Advertisement

ఈ కార్డును చూడడానికి అచ్చం ఐఫోన్ మొబైల్ ను చూసినట్లుగానే కనబడుతుంది.మొత్తం మూడు పేజీలతో బుక్లెట్ డిజైన్ లేఔట్ తో ఈ వెడ్డింగ్ కార్డును వారి రూపొందించారు.

మొదటి పేజీలో ముందరగా పెళ్ళికొడుకు పెళ్లికూతురు ఫోటోని వాల్ పేపర్ గా బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసి.

అక్కడ పెళ్లికి సంబంధించిన టైము, రోజుని ముద్రించారు.ఇక ఆ లోపల ఒకటి వాట్సాప్ చాట్ మెసేజ్ ఫార్మేట్ లో కొంత సమాచారాన్ని పొందుపరచగా.మరో పేజీలో కళ్యాణ వేదిక సంబంధించిన గూగుల్ మ్యాప్స్( Google Maps ) పొందుపరిచారు.

ఇక చివరి పేజీలో అద్భుతమైన ఫోన్ కెమెరా ఫోటోలు కలిగి ఉంది.ఈ కార్డు 3d డిజైన్ ను పోలి ఉంది.ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు వారి శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

ముందుగా ఈ పెళ్లి కార్డు ధర ఎంత.? అని చాలామంది కామెంట్ చేయగా.మరొకరు అయితే.

, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బాసు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు