మాజీమంత్రి వివేకా హత్య కేసుపై సీబీఐ కోర్టులో విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.

ఇందులో భాగంగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

అదేవిధంగా కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులను పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు.ఈ నేపథ్యంలో వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.

కాగా వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రమేయం కూడా ఉందంటూ సీబీఐ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు