నటుడుగా, ప్రతి నాయకుడిగా నటించి విశేష ప్రతిభ కనబరిచిన నటుడు శుభలేఖ సుధాకర్. నిజానికి “శుభలేఖ” ఆయన ఇంటిపేరు కాదు.
ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యారు.
కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రంలో చిరంజీవి – సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ – తులసి మరో జంటగా నటించారు.శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ – తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.ఆ తరువాత తెలుగు, తమిళ టీ.వి.ధారావాహికలలో నటించి, అందరి ప్రశంసలు పొందారు.
జీవితంలో కష్టం, సుఖం రైలు పట్టాల లాగా రెండూ ఉంటాయి.1982 ఒక నటుడు కావాలని ఇక్కడికి వచ్చాను.అపుడు చాలా సన్నగా ఉండే వాడిని.కాస్ట్యూ మర్స్ ఎప్పుడూ అనే వాళ్లు ఒక హ్యంగర్ కి ప్యాంట్, చొక్కా వేసినట్టు ఉంటుంది అని.నా పర్సనాలిటీ ను చూసి అసలు సినిమాల్లో తీసుకుంటారా అని ఒక డౌట్ ఉండేది.కానీ అందరి ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చానని ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ చెప్పుకొచ్చారు.

90 సినిమాలు చేసిన తర్వాత కూడా డ్రైవర్ ఉద్యోగం చేయడానికి కూడా సిద్దమయ్యానని సుధాకర్ తెలిపారు.ఎందుకంటే అప్పటి వరకు నేను ఒంటరిగా ఉండే వాడిని.కానీ శైలజని పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యతలు కూడా పెరిగాయి.కాబట్టి ఖర్చులు కూడా పెరగడంతో ఇక చేయడం తప్పలేదని ఆయన అన్నారు.