ఇంటి పోరే టి.కాంగ్రెస్ కొంపముంచుతుందా?

కాంగ్రెస్ పార్టీ( Congress party )ని ప్రత్యర్ధులు ఓడించాల్సిన అవసరం లేదు వారిని వారే ఓడించుకుంటారు అన్నది ఒక నానుడి.

ఇప్పుడు తెలంగాణ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది .

ఇప్పటీకే అనేక రాష్ట్రాలలో ఈ అంతర్గత పోరు తో కాంగ్రెస్ చాలా నష్టపోయింది.పంజాబీ వంటి రాష్ట్రాలలో ఆ పార్టీ కీలక నేతల మధ్య వ్యక్తిగత ఇగోలతోనూ గొడవలతోనూ అ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ కర్ణాటక వంటి రాష్ట్రాలలో రెండు వర్గాల ఐక్యతతోనే అక్కడ భారీ మెజారిటీతో గెలుపొందింది .అయితే తెలంగాణలో రేవంత్( Revanth reddy ) వర్సెస్ సీనియర్లుగా ఉన్న వాతావరణాన్ని కాంగ్రెస్ అధిష్టానం కలుగ చేసుకుని చక్కదిద్దడం తో కాంగ్రెస్ ట్రాక్ లో పడింది .

తెలంగాణ లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని సర్వే రిపోర్ట్ లు కూడా రావడంతో కాంగ్రెస్ కు కొత్త కళ కూడా వచ్చింది .అయితే ఒకసారి టికెట్ల కేటాయింపు ప్రకటన వచ్చిన తర్వాత మళ్లీ కాంగ్రెస్లో లొల్లి పూర్వ స్థాయికి చేరింది.ముఖ్యంగా రేవంత్ వేదికగా అనేక తీవ్ర ఆరోపణలు సీనియర్లు చేస్తున్నారు.

రేవంత్ ధన రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ ఇమేజ్ ని పాడు చేస్తున్నారు అంటూ సీనియర్లు అధిష్టానానికి కంప్లైంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరోపక్క దేశ వ్యాప్తం గా కుల గణన బీసీ లకు న్యాయం అంటూ చెబుతున్న కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం ఆ సంప్రదాయాన్ని పాటించటం లేదని 50 శాతం పైగా ఉన్న బీసీలకు ఆ స్థాయిలో టికెట్లు ఇవ్వడం లేదంటూ కూడా బీసీ వర్గం నాయకులు నిలదీస్తున్నారు.

Advertisement

పొన్నాల లక్ష్మయ్య వంటి పిసిసి అధ్యక్షుడిగా చేసిన బీసీ నాయకుడిని పార్టీ దూరం చేసుకోవడం తో ఆ ప్రభావం కాంగ్రెస్పై గట్టిగానే పడినట్లుగా తెలుస్తుంది.ఇప్పుడు పొన్నాల ( Ponnala Lakshmaiah ) కేంద్రం గా కాంగ్రెస్ ను కార్నర్ చేయడానికి అధికార పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తుంది .ఒకపక్క రెబల్ అభ్యర్థుల అసంతృప్తులు మరోపక్క సీనియర్ల ఎదురుదాడి తో రేవంత్ వర్గం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు గా తెలుస్తుంది.ప్రత్యర్ధుల తో చేయాల్సిన యుద్ధం రేవంత్ సొంత నేతలతో చేయాల్సిన పరిస్తితి వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.

మరి తొందరగా అధిష్టానం రంగంలోకి దిగి ఈ పరిస్థితిని చక్కదిద్దక పోతే అంది వచ్చిన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకోవాల్సిన పరిస్థితి కి కాంగ్రెస్స్ దిగజారిపోతుంది అని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.అంతర్గత ప్రజాస్వామ్యానికి కేరాఫ్ అడ్రసు గా కనపడే కాంగ్రెస్ ఇప్పుడు అదే అంతర్గత గొడవలతో అదికారం కోల్పోతుందా అన్న విశ్లేషణలు వస్తున్నాయి .మరి కర్ణాటక( Karnataka )ను చూసి తెలంగాణ కాంగ్రెస్ ఏం నేర్చుకుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు