ప్రభాస్ నెక్స్ట్ మూవీ షూట్ పై లేటెస్ట్ అప్డేట్!

ప్రెజెంట్ ప్రభాస్ పాన్ ఇండియా సార్ గా స్టార్ డమ్ అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

ఈయన చేసిన బాహుబలి సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రభాస్ కు బాలీవుడ్ లో ఏ హీరో అందుకోనంత స్టార్ డమ్ అందుకున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత భారీ అంచనాలతో రిలీజ్ అయిన రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఈయన ఫ్యాన్స్ కొద్దిగా డిజప్పోయింట్ అయ్యారు.అందుకే ఈయన చేసే నెక్స్ట్ సినిమా అయినా బాహుబలి రేంజ్ హిట్ రావాలని కోరుకుంటున్నారు.

ఇక ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు చేతిలో ఉండగా.

ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటుంది.ఇక సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు కూడా షూట్ జరుపు కుంటున్నాయి.

Advertisement

వీటితో పాటు ప్రభాస్ మరో సినిమా చేస్తున్నాడు.మారుతి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.ఇప్పటికే సైలెంట్ గా ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్టు టాక్.

రాజా డీలక్స్అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నట్టు టాక్.అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ప్రభాస్ ప్రెజెంట్ ప్రాజెక్ట్ కే షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.మరి ఈ సినిమా షూట్ కు గ్యాప్ ఇచ్చి ప్రభాస్ మారుతి సినిమాలో జాయిన్ అవ్వబోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే వరం స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై జి విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ కూడా నటించ బోతున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు